ప్రస్తుతం ఉన్న నిత్యవసర వస్తువుల ధరలతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. వీటితో పాటు వంటగ్యాస్ ధర కూడా ఆర్ధికంగా ఇబ్బందికి గురిచేస్తుంది. ఈ బాధలు ఒకవైపు అయితే గ్యాస్ సిలిండర్ వంటి ఇతర వస్తువులను సప్లయ్ చేసే వారి వసూలు మరొకవైపు. గ్యాస్ ధర కంటే అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి, నివాసం ఉండే ఫ్లోర్ బట్టి సిలిండర్ సప్లయ్ చేసే వాళ్లు డబ్బులు వసూలు చేస్తుంటారు. అదనంగా ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించిన వారిపై పరోక్షంగా కక్ష సాధింపు చర్యలు చేస్తారు. తాజాగా రూ.30 ఇవ్వలేదని గ్యాస్ డెలివరీ చేసే వ్యక్తి సిలిండర్ ను వెనక్కి తీసుకెళ్లాడు. తనకు జరిగిన అన్యాయంపై బాధితుడు వినియోదారుల ఫోరం కి ఫిర్యాదు చేయగా గ్యాస్ ఏజెన్సీ వాళ్లకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాకు చెందిన ఓ వినియోగదారుడు 2019 అక్టోబరు 7న గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకున్నారు. అనంతపురం పట్టణంలోని గుత్తిరోడ్డులో ఉన్న ఓ గ్యాస్ ఏజెన్సీ నుంచి డెలివరీ బాయ్ గ్యాస్ సిలిండర్ ను వినియోదారుడి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో గ్యాస్ ధర మాత్రమే వినియోదారుడు డెలివరీ బాయ్ కి చెల్లించాడు. అయితే అదనంగా రూ.30 ఇవ్వాలని డెలివరీ బాయ్ వినియోగదారుడ్ని కోరాడు. తాను ఇవ్వనని చెప్పడంతో డెలివరీ బాయ్ గ్యాస్ సిలిండర్ ను వెనక్కి తీసుకెళ్లాడు. దీంతో ఇంట్లో గ్యాస్ సిలిండర్ లేకపోవడంతో సదరు వ్యక్తి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు.
దీంతో వెంటనే తనకు జరిగిన అన్యాయంపై పౌర సరఫరాల అధికారిని బాధితుడు సంప్రదించాడు. దీంతో గ్యాస్ ఏజెన్సీ వాళ్లు తిరిగి సిలిండర్ ను బాధితుడి ఇంటి ముందు ఉంచి వెళ్లిపోయారు. ఇదే విషయంపై పౌరసరఫరాల అధికారి.. గ్యాస్ ఏజెన్సీ వాళ్లను ప్రశ్నించింది. తమకు సరఫరా ఖర్చులు ఉంటాయని, వాటిని డెలివరీ బాయ్ అడుగుతారని.. వారు చేసిన తప్పును సమర్థించుకున్నారు. అనంతరం తమపై ఫిర్యాదు చేశాడనే కోపంతో బాధితుడి గ్యాస్ డెలివరీని మరో ఏజెన్సీకి బదిలీ చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన వినియోదారుడు, తనపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడని భావించాడు. దీంతో ఈ సారి నేరుగా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. అనంతరం మరోసారి జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు.
గ్యాస్ సిలిండర్‌ను సకాలంలో డెలివరీ చేయకపోవడం వల్ల తాను ఎదుర్కొన్న సమస్యలను ఫోరం దృష్టికి తీసుకెళ్లాడు. అతడి ఫిర్యాదుపై స్పందించిన వినియోదారుల ఫోరం.. గ్యాస్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది. అధికారుల నోటిసులకు స్పందించిన సదరు ఏజెన్సీ సంస్థ డెలివరీ బాయ్‌ను తొలగించామని, కాబట్టి జరిమానా చెల్లించాల్సిన అవసరంలేదని ఏజెన్సీ వాదించింది. వాదనలు విన్న ఫోరం వినియోగదారుడికి జరిగిన మానసిక, ఆర్ధిక నష్టానికి గాను పరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది. వినియోదారుల ఫోరం ఇచ్చిన తీర్పుకి గ్యాస్ ఏజెన్సికి దిమ్మతిరిగింది. మరి.. ఈ వినియోదారుల ఫోరం ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.