ఇటీవల కొంత మంది వైద్యుల నిర్లక్ష్యం వల్ల పేషెంట్లు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర, కాటన్ మర్చిపోయిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. పేషెంట్లు స్కాన్ తీసుకున్న తర్వాత ఇలాంటి విషయాలు బయట పడటం.. వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతూనే ఉంది. ముగ్గురు డాక్టర్లు చేసిన నిర్లక్ష్యం వల్ల ఓ యువకుడు చనిపోయాడు. ఆ యువకుడి ప్రాణాలు పోవడానికి కారణం అయిన ముగ్గురు డాక్టర్లు కలిసి అతని కుటుంబానికి రూ.40 నష్టపరిహారం ఇవ్వాలని వినియోగదారుల కమీషన్ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ ఘటన విశాఖపట్నంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
విశాఖపట్నం కి చెందిన శీల తులసీరామ్ అనే యువకుడికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో 2013 అక్టోబర్ 8 న క్విన్ హాస్పిటల్ కి తీసుకు వెళ్లారు కుటుంబ సభ్యులు. తులసీరామ్ కి కడుపు నొప్పి తీవ్రం కావడంతో అతనికి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. ఈ మేరకు ఆ రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో తులసీరామ్ కి ఆపరేషన్ చేశారు వైద్యులు. ఆపరేషన్ తర్వాత తులసీరామ్ ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అతని పరిస్థితి ఏంటో కుటుంబ సభ్యులకు తెలియనీయకుండా చేశారు వైద్యులు. అంతే కాదు కేసుకు సంబంధించిన రికార్డులు కూడా కుటుంబ సభ్యులకు చూపించలేదు. తర్వాత రోజున తులసీరామ్ పూర్తిగా కోమాలోకి వెళ్లిపోయాడు. అదే నెల 12 న అతడు ప్రాణాలు వదిలాడు.
తులసీరామ్ మృతిపై అనుమానాలు వచ్చిన కుటుంబ సభ్యులు 2015 లో వినియోగదారుల కమిషన్ కి ఫిర్యాదు చేశారు. కేవలం కడుపు నొప్పి అని ఆసుపత్రికి వచ్చిన వ్యక్తిని అన్యాయంగా చంపేశారని.. తమకు న్యాయం చేయాలని కోరారు. తమకు నష్టపరిహారంగా రూ.99.9 లక్షల పరిహారం ఆసుపత్రి యాజమాన్యం చెల్లించాలని కోరారు. ఈ విషయం కమీషన్ సీరియస్ గా తీసుకుంది. తులసీరామ్ కి ఆపరేషన్ కి సంబంధించి ఏ విషయం కూడా రికార్డులో నమోదు చేయలేదని డాక్టర్ తనూజ అంగీకరించిందని.. పూర్తిగా వైద్య సేవలో నిర్లక్ష్యం కారణంగానే తులసీరామ్ మరణించినట్లుగా నిర్దారించింది.
మృతి చెందిన తులసీరామ్ తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు మానవ హక్కుల కమీషన్ ద్వారా కేజీహెచ్ వైద్యుల బృందం సైతం ఈ ఘటనపై విచారణ జరిపింది. మృతుడి విషయంలో మత్తుమందు నిర్లక్ష్య, వైద్యుల నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని అందుకే వీటన్నింటిని పరగణలోకి తీసుకొని తులసీ రామ్ కుంటాబానికి యాజమాన్యం సిబ్బందితో పాటు అతనికి ఆపరేషన్ చేసిన ముగ్గురు వైద్యులు రూ. 40 లక్షలు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా సంచలన తీర్పు ఇచ్చింది.