మంగళవారం బాపట్ల జిల్లా నిజాంపట్నం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ వేదిక నుంచి వైఎస్సాఆర్ మత్స్యకార భరోసా అయిదో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
నవరత్నాలతో.. ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఎన్నికల ముందు ఇచ్చిన నవరత్నాల హమీలను నెరవేర్చడమే కాక.. ఆ తర్వాత కూడా తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అమ్మ ఒడి, వైఎస్సార్ రైతు భరోసా, ఆరోగ్యశ్రీ వంటి కార్యక్రమాలతో ప్రజల అభివృద్ది కోసం కృషి చేస్తున్నారు. అలానే మంగళవారం మత్స్యకారుల ఖాతాలో 10 వేల రూపాయలు సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విరుచకపడ్డారు.
మంగళవారం బాపట్ల జిల్లా నిజాంపట్నం ఏర్పటు చేసిన భారీ బహిరంగ సభ వేదిక నుంచి వైఎస్సాఆర్ మత్స్యకార భరోసా అయిదో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. బటన్ నొక్కి 1.23 లక్షల మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో రూ.231 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. “ఎన్ని వ్యవస్థలను నాపై ప్రయోగించిన కూడా పదిహేను ఏళ్లుగా ఎక్కడ రాజీపడలేదు. మీ బిడ్డ ప్రజల తరపున నిలబడి.. మంచి చేస్తున్నాడు. మీకు మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలవండి. ప్రధానితో సమావేశమైతే చాలు నాపై దుప్ఫ్రచారం చేస్తారు.
చంద్రబాబు, టీడీపీ వెంటిలేటర్ పై ఉన్నాయి. దత్తపుత్రుడు రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా ప్రజలు నమ్మలేదు. నువ్వు వద్దంటూ దండం పెట్టి మరీ పంపారు. ఒక్కొ ఎన్నికకు ఒక్కో రేటు పెట్టి పార్టీని అమ్ముతున్న ప్యాకేజ్ స్టార్ కు సీఎం పదవి అవసరం లేదంట. బీజేపీతో కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకునేది వీళ్లే.. అలానే విడిపోయేది వీళ్లే. అదే విధంగా పెళ్లిళ్లు చేసుకునేది.. విడాకులు ఇచ్చేది వీళ్లే.. చంద్రబాబు ఏం చెబితే దానికి తల ఆడించడం ఒక్కటే దత్త పుత్రుడికి తెలిసింది. టీడీపీని నలుగురు కలిపి లేపాల్సిన పరిస్థితి ఉంది. టీడీపీ చక్రం తిప్పుతుందని వారి అనుకూల మీడియాలో చెబుతున్నాయి.
అక్కడెక్కడో కర్నాటకలో కాంగ్రెస్ గెలిస్తే దానికి కారణం చంద్రబాబు అని చెప్పుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని చూసి గత పాలకులు తట్టుకోలేకపోతున్నారు. పేదవాడికి మంచి చేస్తుంటే చూడలేకపోతున్నారు. ఎన్నికలప్పుడే చంద్రబాబుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు గుర్తొస్తారు. నేను మంచిని నమ్ముకున్నాను, అలానే ప్రజల్ని నమ్ముకున్నాను ” అంటూ సీఎం జగన పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. మరి..సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.