ఆంధ్రప్రదేశ్ లో గత కొంత కాలంగా రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అధికార పక్షంపై ప్రతిపక్షలు మాటల యుద్దానికి దిగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తుంటే.. చంద్రబాబు పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు.
టీడీపీ అధ్యక్షకుడు నారా చంద్రబాబు నాయుడపై శుక్రవారం బిక్కవోలు పోలీస్ కేసు నమోదు అయ్యింది. రాజమండ్రి డీఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదు మేరకు చంద్రబాబు తో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. చంద్రబాబు నిబంధనలకు విరుద్దంగా నడిరోడ్లపై రోడ్ షో నిర్వహించారు. చంద్రబాబు ని రోడ్లపై బహిరంగ సభలు, రెడ్ షోలు నిర్వహించకూడదు అని పోలీసులు చెప్పగా వారిపై దురుసుగా మాట్లాడమే కాదు.. దూషించడంపై డీఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చంద్రబాబు పై ఐపీసీ సెక్షన్ 143, 353, 149, 188 కింద కేసు నమోదు చేశారు.
తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ సుధీర్ రెడ్డి స్పందిస్తూ.. అనపర్తిలో ప్రతిపక్ష నేత చంద్రబాబు బహిరంగ సభ కోసం అనుమతి కావాలని ఆ పార్టీ నేతలు కోరారు.. అయితే పోలీస్ యాక్ట్ జీవో నంబర్ -1 ప్రకారం రోడ్లపై ఎలాంటి సభలు కానీ, రోడ్ షో కానీ నిర్వహించకూడదు అనే నియం ఉంది. ఈ కారణంతోనే పోలీసులు సభ నిర్వహణ కు అనుకూలంగా మరో ప్రదేశం కళాక్షేత్రంలో నిర్వహించుకోవచ్చని సూచించారు. అక్కడ తాము పూర్తి భద్రత ఏర్పాటు చేస్తామని కూడా తెలిపారు. కానీ నిబంధనలకు విరుద్దంగా చంద్రబాబు నాయుడు రోడ్ షో తో అనపర్తి వైపు బయలు దేరారు.
ఈ క్రమంలో పోలీసులు వారిని ఆపేందుక ప్రయత్నించగా టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మద్య తోపులాట జరిగింది. ఆ సమయంలో పోలీసులకు స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ అధినేత చంద్రబాబుపై, మరో ఏడుగురిపై టీడీపీ నేతలపై, పలువురు టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.