తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన విశాఖ సాయి ప్రియ కేసు మొత్తానికి భర్త అంకీకారంతో శుభం కార్డు పడింది. కానీ సాయి ప్రియ చేసిన పని వల్ల ప్రభుత్వానికి ధన నష్టం మాత్రమే కాదు సమయం కూడా వృధా అయిన విషయం తెలిసిందే. తాజాగా సాయి ప్రియ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. సాయి ప్రియతో పాటు ఆమె ప్రియుడు రవితేజపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..
విశాఖపట్నం సంజీవయ్య నగర్ కి చెంది సాయి ప్రియకు శ్రీనివాస్ రావు అనే వ్యక్తితో వివాహం జరిగింది. మొదటి నుంచి ఆ వివాహంపై అనాసక్తి ఉన్న సాయి ప్రియ తప్పని సరి పరిస్థితిలో భర్తతో సంసారం చేస్తుంది. హైదరాబాద్ లో జామ్ చేస్తున్న శ్రీనివాస రావు తమ పెళ్లి రోజు జరుపుకునేందుకు జూలై 22 న విశాఖపట్నం వచ్చాడు. ఉదయం సంతోషంగా గడిపిన ఆ జంట సాయంత్రం ఆర్కే బీచ్ కి వచ్చారు. ఇంటికి బయలు దేరుదాం అనుకున్న సమయంలో శ్రీనివాస రావు కి ఫోన్ రావడంతో పక్కకు వెళ్లాడు. తిరిగి వచ్చాక అక్కడ సాయి ప్రియ కనిపించకపోవడంతో కంగారు పడ్డాడు.
ఒకవేళ అలలు రావడంతో తన భార్య అందులో కొట్టుకు పోయి ఉండవొచ్చని అనుమానంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. గజ ఈతగాళ్లు, నేవీ హెలికాప్టర్, బోట్ల సహాయంతో తీవ్రంగా గాలించారు. అక్కడి సీసీ కెమెరాలను కూడా నిశితంగా పరిశీలించారు. అన్ని చోట్ల ఆమె జాడ కోసం వెతికినా ఫలితం లేకుండా పోయింది. సాయి ప్రియని వెతకడం కోసం ఇందుకోసం ప్రభుత్వ ధనం భారీగానే ఖర్చు చేయాల్సి వచ్చింది.
ఇక పోలీసులు వేరే కోణంలో ఆరా తీయడం మొదలు పెట్టారు. సాయి ప్రియకు సంబంధించిన కాల్ డేటాపై దృష్టి పెట్టి ఆ కోణంలో విచారణ కొనసాగించారు. తాను క్షేమంగా ఉన్నానని.. తన ప్రియుడు రవితేజను పెళ్లి చేసుకున్నానని ఫోటోలు పంపించింది. కొన్ని రోజుల పాటు ఈ కేసులు పలు కీలక సంఘటనలు చోటు చేసుకున్నాయి. మొత్తానికి సాయి ప్రియ భర్త ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో కథ సుఖాంతం అయ్యింది. కానీ, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినందుకు.. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించినందుకు గాను సాయిప్రియ, ఆమె ప్రియుడు రవితేజపై పలు సెక్షన్ల కింద కోర్టు అనుమతితో పోలీసులు కేసు నమోదు చేశారు.