ప్రతి మనిషికి కుటుంబం అనేది ఓ అందమైన ప్రపంచం. ఇందులో సభ్యులకు ఒకరిపై మరొకరి ప్రేమానుబంధాలు ఉండాయి. కుటుంబంలో ఎవరికైనా చిన్న ఇబ్బంది కలిగిన మిగిలిన వారు అల్లాడుతారు. అలాంటిది అనుకోని సంఘటనతో తమ వ్యక్తి అర్థాంతరంగా మరణిస్తే.. ఇక ఆ కుటుంబ సభ్యులు బాధ వర్ణణాతీతం. కానీ తమ మనిషి మరణించిన కూడా బ్రతికుండాలని కొందరు కోరుకుంటారు.ఈ క్రమంలో వారి కుటుంబ సభ్యులు ఎంతో ఔదార్యంతో అవయవదానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. మరణించిన మనిషి అవయవదానంతో పదిమంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. ఈ మంచి పని మృతి చెందిన వ్యక్తిని చిరంజీవిని చేస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ఓ మహిళ రోడ్డు ప్రమాదం కారణంగా బ్రెయిన్ డెడ్ అయింది. ఆ మహిళ కుటుంబ సభ్యులకు ఔదార్యంతో అవయవదానం చేసి నలుగురి జీవితాల్లో వెలుగు నింపారు.
వివరాల్లోకి వెళ్తే… తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సుబ్రహ్మణ్యేశ్వరి అనే మహిళ పనిచేస్తోంది. ఈనెల 28న సుబ్రహ్మణ్యేశ్వరి రోడ్డు ప్రమాదనికి గురైంది. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న సమయంలో బ్రెయిన్ డెడ్ అయింది. ఆమె కుటుంబ సభ్యులకు అవయవదానంపై వైద్యులు అవగాహన కల్పించారు. దీంతో అవయవదానానికి కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు. వైద్యులు బ్రెయిన్ డెడ్ అయిన ఆ సుబ్రహ్మణ్యేశ్వరి కళ్లు, రెండు కిడ్నీలను సేకరించారు. ఓ కిడ్నీని కాకినాడకు చెందిన రామకృష్ట రెడ్డికి, మరొక కిడ్నీని విశాఖ జిల్లాలో అపోలో ఆసుపత్రికి తరలించారు.
ఈ క్రమంలో గ్రీన్ కారిడార్ ద్వారా సకాలంలో విశాఖలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాద్ మాట్లాడుతూ.. మనిషి చనిపోయిన తరువాత కూడా అవయవదానంతో నలుగురిలో జీవించ వచ్చు. ఈ మంచి పని చేసిన మృతురాలి కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు తెలిపారు. మరణించాక మట్టిలో కలిసిపోయే ఈ శరీరం చనిపోయే ముందు అవయవదానంతో ఇలా నలుగురి బ్రతికిస్తుంది. అలా అవయవదానం చేసే వారు చిరంజీవిగా మన మధ్య జీవిస్తుంటారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.