దేశ రాజకీయాల్లోనే ఏపీ రాజకీయాలు వెరైయ్యా…అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. ఏపీ రాష్ట్ర రాజకీయాలను చూస్తే కురుక్షేత్రాన్ని తలపిస్తుందని కొందరు అభిప్రాయపడ్డారు. అధికార పక్షంపై ప్రతి పక్షం వరదలకు సంబంధించి విమర్శలు చేస్తుంటే… అసలు కారకులు మీరే అంటూ ప్రతిదాడి చేస్తుంది అధికార పక్షం. ఏపి అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ వాళ్లు అవమానకర వాఖ్యలు చేశారంటూ తెదేపా వారు ఆరోపించారు. దీనిపై ఇరు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు కూడా జరిగాయి.
ఇటీవల రాచమల్లు శివప్రసాద్ స్పందిస్తూ.. చంద్రబాబే గ్రామ, గ్రామానా గౌరవ సభల పేరుతో ఆమెను అవమానిస్తున్నాడని తెలిపాడు. తాజాగా చంద్రబాబు నాయుడిపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వంపై బురద చల్లడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
మీడియా మైకులు కనిపిస్తే చాలు.. చంద్రబాబు రెచ్చిపోతారంటూ ఆయన ఎద్దేవా చేశారు. “మభ్య పెట్టడం, మోసం చేయడం చంద్రబాబుకు బాగా తెలుసు. చిత్తశుద్ధి, పని చేయాలనే తపన ఆయనలో లేదని” మంత్రి బొత్స దుయ్యబట్టారు. బొత్స సత్యానారాయణ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
