బంగాళా ఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో గత పది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా నదులు, చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ప్రస్తుతం బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న అల్పపీడనం తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తుంది. గత కొన్నిరోజులుగా రెండు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయం అయ్యాయి. వాగులు, వంకటు పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉండటం వల్ల చేపలు పట్టేవారు వేటకు వెళ్లవొద్దని చూసించింది. సాధారణంగా భారీగా వర్షాలు కురిసినపుడు సుముద్ర తీరంలో భారీ తిమింగలాలు, చేపలు కొట్టుకు వస్తుంటాయి. తాజాగా ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో అరుదైన దృశ్యంచోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం.. డి మారువాడ సముద్ర తీరంలో ఓ భారీ నీలి తిమింగలం కొట్టుకొచ్చింది. సుమారు 25 అడుగుల మేర పొడవు, ఐదు టన్నుల వరకు బరువు ఉన్న ఈ తిమింగలం అప్పటికో చనిపోయింది ఉంది. ఈ నీలి తిమింగలాన్ని బ్లూ వేల్ అంటారని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ భారీ నీలి తిమింగలం చాలా విచిత్రంగా కూడా ఉందని అంటున్నారు. దీనిని చూసేందుకు మత్స్యకారుల, చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అరుదైన నీలి తిమింగలం వద్ద యువత సెల్ఫీలు తీసుకొని సోషల్ మాద్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు.
భారీ వర్షాలు కురిసినపుడు సముద్రంలో అలజడి ఏర్పడుతుంది. పెద్ద పెద్ద అలలు తీరాన్ని తాకుతుంటాయి.. ఆ సమయంలో కొన్ని తిమింగలాలు, భారీ చేపలు సముద్ర తీరానికి కొట్టుకు వస్తుంటాయని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే నీలి తిమింగలం సముద్రతీరానికి కొట్టుకొచ్చిన సమయంలో మరణించి ఉందని అక్కడి మత్య్సకారులు తెలిపారు. నీలిరంగుతో ఎంతో ఆహ్లాదకరంగా కనిపించే సముద్రం.. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో అల్లకల్లోలంగా ఉందని అంటున్నారు మత్స్యకారులు. సాధారణంగా సముద్రంలో కనిపించే బ్లూ వేల్ చేపలు ప్రత్యక్షంగా చూడటం ఇదే మొదటిసారి అంటూ స్థానికులు అంటున్నారు. భారీ వర్షాలు, వాయుగుండం వల్ల ఇంకెన్ని సముద్ర జీవులు ఒడ్డుకు కొట్టుకువస్తాయో తెలియని పరిస్తితి అంటున్నారు.