ఏపీ రాజకీయలో అధికార, ప్రతిపక్షాల మధ్య నిత్యం మాటల యుద్ధం జరుగుతుంది. ప్రభుత్వం చేసే కార్యక్రమాలపై, పథకాలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తుంటాయి. దానికి అధికార పార్టీ నేతలు కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తుంటారు. అయితే తాజాగా ఆర్టీసీ సంస్థ కూడా ప్రతిపక్ష టీడీపీ పొలిటికల్ వింగ్ కు కౌంటర్ ఇచ్చింది. మరి.. ఆర్టీసీకి రాజకీయలతో సంబంధం ఏంటని అనుకుంటున్నరా.? ఆర్టీసీ టీడీపీకి కౌంటర్ ఎందుకు ఇచ్చింది అనే సందేహం వస్తుందా.? అయితే ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఇటీవల ఓ ఆర్టీసీ బస్సుపై టార్పలిన్ కప్పిన ఫొటోతో ఓ మీమ్ బయటకొచ్చింది. ” బయట అప్పు పుట్టడం లేదని ఆర్టీసీ బస్సులను ఇసుక లారీల్లాగా గానీ వాడేస్తున్నారేంట్రా..? అంటూ బ్రహ్మానందం పిక్ తో మీమ్ టీడీపీ పొలిటికల్ వింగ్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చివరికి ఆర్టీసీ దృష్టికి వెళ్లింది. దీంతో ఆ సంస్థ ఈ మీమ్స్ పై ఘాటుగానే స్పందించింది. “టీడీపీ పొలిటికల వింగ్ పోస్ట్ చేసిన బస్సు ప్యాసింజర్లను తీసుకెళ్లడం లేదు. దాని పై భాగం లీక్ కూడా కావడం లేదు. విద్యాశాఖ ఆర్టీసీపై నమ్మకంతో స్కూల్ పుస్తకాల పంపిణీ బాధ్యతను అప్పగించింది. అందులో భాగంగా బస్సులో పాఠ్యాపుస్తకాలను రవాణా చేశాం.
స్కూళ్లు ప్రారంభం కావడంతో. త్వరగా పిల్లలకి పుస్తకాలు అందేలా చూడటం కోసం భారీ సంఖ్యల్లో బస్సులో వాటిని రవాణా చేస్తున్నాము. తక్కువ సమయంలో ఎక్కువ పుస్తకాలు రవాణా చేయాల్సి ఉండటం.. వర్షకాలం కావడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బస్సు కిటికీలను టార్పలిన్లతో కప్పి ఉంచాము. ఇప్పటి వరకూ ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 25 లక్షల పుస్తకాలను రవాణా చేశాం. బహుశా మీ బంధువుల పిల్లలకు కూడా మా పని వల్ల లబ్ధి చేకూరి ఉంటుంది. మేం చేస్తున్న మంచి పని పట్ల ప్రతికూలతను, మీరు రూమర్లను ప్రచారం చేయడం మాకు షాకిచ్చింది. మీ పోస్టును వెంటనే డిలీట్ చేయండి.
మేం న్యాయనిపుణుల సలహా తీసుకుంటాం. లీగల్ యాక్షన్ తీసుకుంటాం” అని టీడీపీ పొలిటికల్ వింగ్‌ను ఆర్టీసీ తెలియజేసింది. ఈ పోస్ట్ ను ఆర్టీసీ ఫేస్ బుక్ ద్వారా టీడీపీ పొలిటికల్ వింగ్ ను ట్యాంగ్ చేసింది. దీనకి పోస్టు డిలీట్ చేస్తామిని టీడీపీ పొలిటికల్ వింగ్ తెలిపింది. మరి.. టీడీపీ పొలిటికల్ వింగ్ కు ఆర్టీసీ ఇచ్చిన కౌంటర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
Please delete your post immediately. APSRTC will take legal opinion and initiate such legal action as deemed appropriate as per relevant provisions of law.
— APSRTC (@apsrtc) June 25, 2022