విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తోన్న ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జీవో విడుదల చేశారు. దీని వల్ల పేద విద్యార్థులకు ఎంతో మేలు జరగనుంది.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తోన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టిన సంస్కరణలపై విదేశాల ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా నాడు-నేడు, అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వంటి కార్యక్రమాల ద్వారా విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నారు సీఎం జగన్. ఇక తాజాగా పేద విద్యార్థులకు జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. విద్యా హక్కు చట్టం కింద.. రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్లల్లో 25 శాతం సీట్లను పేదలకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించి తాజాగా జీవోను విడుదల చేసింది.
రాష్ట్రంలోని నిరుపేదలకు ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం కింద 25 శాతం సీట్లు కేటాయించాలని జగన్ సర్కార్ జోవో జారీ చేసింది. ఆర్టీఈ చట్టం కింద ఒకటో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలలకు సంబంధించి మార్చి 4న ప్రదేశాల క్యాలెండర్ విడుదల చేసింది. మార్చి 6-18 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించింది. ఆయా ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలలు సంబంధింత వెబ్‌సైట్‌లో మార్చి 18 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక మార్చి 18 నుంచి విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధిత వెబ్‌సైట్ విండో అందుబాటులోకి వస్తుంది. ఏప్రిల్ 7 వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 9-12 వరకు అర్హులైన విద్యార్థుల ఎంపిక చేపడతారు. మొదటి విడత కేటాయింపు ఏప్రిల్ 13న లాటరీ ద్వారా ఉంటుంది. ఏప్రిల్ 15-21 వరకు విద్యార్థలు ఆయా స్కూల్స్‌లో చేరికలను ఖరారు చేసుకోవాలి.
తర్వాత రెండో విడత సీట్ల కేటాయింపు ఏప్రిల్ 25న లాటరీ ద్వారా చేపడతారు. వీరు ఏప్రిల్ 26-30లోపు ఆయా పాఠశాలల్లో చేరాలి. ఈ స్కూల్లో ఫీజ్ రియంబర్స్‌మెంట్ కింద పట్టణ ప్రాంతాల్లో ఒక్కో విద్యార్థికి రూ.8 వేలు, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రూ.6500, గిరిజన ప్రాంతాల్లో రూ. 5వేలను ప్రభుత్వం చెల్లిస్తుంది. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.