ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్న పినిసే విశ్వరూప్ శుక్రవారం మరోమారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ నెల 2 న ఆయన వైయస్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో మంత్రి విశ్వరూప్ అస్వస్థతకు గురి కావడంతో వెంటనే సిబ్బంది రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత హైదరాబాద్ కి తరలించారు. ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకున్న తర్వాత ఆయనని డిశ్చార్జ్ చేశారు వైద్యులు.
మంత్రి విశ్వరూప్ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో రాజమండ్రిలోని ఓ హాస్పిటల్ లో ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయనకు మెరుగైన వైద్య చికిత్స చేయించడానికి కుటుంబ సభ్యులు ముంబైకి తరలించారు. ఆయన గత కొంత కాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు అంటున్నారు.
గతంలో కూడా రెండు సార్లు ఇలాంటి బాధతోనే ఆయన హైదరాబాద్ కి వెళ్లినట్లు తెలస్తుంది. తమ అభిమాన నేత త్వరగా కోలుకొని క్షేమంగా రావాలని అభిమానులు, పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ శుక్రవారం మరోమారు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆయనను కుటుంబ సభ్యులు ముంబైకి తరలించారు. గుండె సంబంధిత సమస్యలతో విశ్వరూప్ బాధపడుతున్నట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం.