ఏపీలో ఆరోగ్య రక్షణ కొరకు జగన్ ప్రభుత్వం చాలా ప్రాధాన్యత వహిస్తుంది. గుండెపోటు బాధితులకు సరికొత్తగా స్టెమీ ప్రాజెక్టును తీసుకొచ్చారు. కార్డియాలజీ, కార్డియోవాస్క్యూలర్ సేవలను ప్రజలకు మరింత దగ్గరగా తీసుకువచ్చేందుకు ఆదేశాలు జారీ చేశారు.
జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం అనేక కార్యక్రమాలను చేపట్టింది. సంక్షేమ కార్యక్రమాలతో పేద ప్రజలకు ఆర్థికంగా సాయం చేస్తుంది. ఆరోగ్య పరంగా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకాలను ప్రవేశపెట్టింది. అందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా మరో కీలక నిర్ణయం తీసుకుంది. గుండె సంబంధిత బాధితులకు స్టెమీ ప్రాజెక్టును తీసుకువచ్చింది. ఈ కార్యక్రమాన్ని వచ్చే నెలలో ప్రారంభించనుంది. ప్రభుత్వం గుండెపోటుతో సంభవిస్తున్న మరణాలను తగ్గించేందుకు ఈ ప్రణాళిక తీసుకొచ్చింది. ఈ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తిరుపతిలో అమలు చేస్తున్నారు. తర్వాత అన్ని జిల్లాల్లో ప్రవేశపెట్దనుంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
ఏపీలో ఆరోగ్య రక్షణ కొరకు జగన్ ప్రభుత్వం చాలా ప్రాధాన్యత వహిస్తుంది. గుండెపోటు బాధితులకు సరికొత్తగా స్టెమీ ప్రాజెక్టును తీసుకొచ్చారు. కార్డియాలజీ, కార్డియోవాస్క్యూలర్ సేవలను ప్రజలకు మరింత దగ్గరగా తీసుకువచ్చేందుకు ఆదేశాలు జారీ చేశారు. గుండె జబ్బులతో బాధపడుతున్న గ్రామీణ ప్రజలను కాపాడేందుకు ఈ సేవలను తీసుకువచ్చారు. సెప్టెంబరు 29న రూపొందించిన స్టెమీ ప్రాజెక్టును మొదలుపెట్టనున్నారు. నాలుగు బోధనాసుపత్రులు హబ్స్‌గా ఉంటాయి. వీటికి కనెక్షన్‌గా 61 స్పోక్స్ సెంటర్లు ఏర్పాటవుతాయి. వీటి ద్వారా పేషెంట్స్కు గోల్డెన్ అవర్ ట్రీట్‌మెంట్ అందేలా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎన్‌సీడీ కారణంగా సంభవించే హార్ట్ స్టోక్ వల్ల 32% వరకు మరణాలు సంభవిస్తున్నాయి. లక్షల మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. అందుకని వారికి గోల్డెన్ అవర్ ట్రీట్‌మెంట్‌లో రూ. 40వేల ఇంజక్షన్‌ను ఉచితంగా పేషెంట్‌కి అందించుటకు నిర్ణయించారు. దీనిని తిరుపతి రుయా ఆస్పత్రిలో పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు.
అనంతరం క్యాథ్ ల్యాబ్స్ ఉన్న ఆస్పత్రికి చేర్చి తదుపరి ట్రీట్‌మెంట్ అందిస్తారు. మొదటి దశలో తిరుపతి, గుంటూరు, కర్నూలు, విశాఖ బోధనాసుపత్రులు హబ్స్‌గా తయారవుతాయి. పైలెట్ ప్రాజెక్టు కింద చిత్తూరు జిల్లాలో 13, కర్నూలు 16,గుంటూరు 15, విశాఖపట్నం 17 స్పోక్స్ కేందరాలు ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో ఏర్పడతాయి. వీటితో శిక్షణ పొందిన వారు పేషెంట్ కి ఎమర్జెన్స్ ట్రీట్‌మెంట్ అందిస్తారు. క్యాథ్ ల్యాబ్స్ కోసం రూ. 120 కోట్లు పెట్టి ఐసీఎంఆర్ సహకారం అందనుంది.
స్టెమిగా పిలిచే ఈ కార్యక్రమంతో రోగులకు గోల్డెన్ అవర్‌లో 40 నిమిషాల్లోనే ట్రీట్‌మెంట్ అందిస్తారు. దీంతో రోగులు ప్రాణాపాయం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. జనవరి నుండి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. స్టెమి అంటే గుండె రక్తనాళం 100 శాతం పూడిపోవడంతో వచ్చే గుండెపోటు. రోగికి వీలైనంత త్వరగా పూడికను కరిగించే చికిత్సను ఇవ్వగలిగితే ప్రాణాలను కాపాడుకోవచ్చు. అవసరమున్న రోగులకు రూ.40 వేలు విలువ చేసే థ్రాంబోలైసిస్ ఇంజక్షన్ ఉచితంగా ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏఎన్ఎంలు, సీహెచ్‌వోల ద్వారా గుండెపోటు లక్షణాలపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు.