ఆంధ్రప్రదేశ్ లో పింఛన్లు తీసుకునే వారికి జగన్ మోహన్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది. కొత్త ఏడాది నుంచి అవ్వాతాతలకు పెన్షన్ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం పెన్షన్ దారులకు రూ. 2500 అందిస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రూ.2,500 నుంచి రూ.2,750కి పెరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా తీపి కబురు అందించింది ఏపీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మంగళవారం ఏపీ సచివాలయంలోని మొదటి బ్లాక్ లో సీఎం జగన్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో మంత్రివర్గం పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా పెన్షన్ పెంపుపై కేబినెట్ కీలక నిర్ణయ తీసుకుంది. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ రూ.2500 ను జనవరి నుంచి రూ.2750 కి పెంచుతూ కేబినెటే నిర్ణయం తీసుకుంది. తాజాగా కేబినేట్ తీసుకున్న ఈ నిర్ణయంతో 62.31 లక్షల మంది పెన్షన్ దారులకు ప్రయోజనం చేకూరనుంది. జనవరి1 నుంచిపెంచిన పెన్షన్ అమలు లోకి రానుంది. ఈ విధంగా పెన్షన్ దారులకు నూతన సంవత్సరం సందర్భంగా జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇదే కేబినెట్ మీటింగ్ లో వైఎస్సార్ పశుభీమా పథకంపై వచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.
\
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వర్చువల్ క్లాస్ లు, స్మార్ట్ టీవీ రూమ్ లను నాడు-నేడు ద్వారా నిర్మించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక పెన్షన్ విషయానికి వస్తే.. గతంలో ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో పింఛన్ల పెంపుపై ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో కూడా పింఛన్లు పెంచుకుంటూ పోతామని చెప్పారు. అలానే అధికారంలోకి వచ్చిన తరువాత పెంచుకుంటూ పోతూ ఇచ్చిన హామీ నిరవేరుస్తున్నామని గతంలో పలు సందర్భాల్లో సీఎం జగన్ చెప్పారు. ఇప్పటికే పింఛన్ ను రూ.2,000 నుంచి రూ.2,250కి.. తర్వాత 2,250 నుంచి రూ.2500లకు పింఛన్ పెంచారు. అలానే తాజాగా రూ.2,500 నుంచి రూ.2,750కి పెంచుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెన్షన్లు పెంచుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.