మంచి చేసే నాయకుడు, ప్రభుత్వాధికారులు అరకొరగా కనపడుతున్న రోజులివి. కనపడనప్పుడు ఇలాంటి బాధ్యతాయుతంగా పని చేసే అధికారులు ఎందుకు రారు.. అని మనలో మనమే ప్రశ్నించుకుంటాం.. అదే మనమీదకు వచ్చేసరికి ఆయన తీరు బాగోలేదంటూ ప్రశ్నిస్తాం.. ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ పై వస్తోన్న పిర్యాదులే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
పేరు.. విజయ్ ప్రతాప్ రెడ్డి. ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఆహార నాణ్యత, పర్యవేక్షణ ఆయన విధులు.. ఆయన చేస్తోంది కూడా అదే. కానీ, అది అక్రమార్కులు నచ్చట్లేదు. దోచుకుకుండా అడ్డుపడుతున్నారని కక్ష్యతో ఆయనపై పిర్యాదులు చేస్తున్నారు. పుడ్ కమిషన్ చైర్మన్ రైడింగ్ లతో హడలెత్తిస్టున్నారంటూ అందరూ ఒక్కచోట చేరి ర్యాలీలు చేస్తున్నారు. తాజాగా, ఈ ఫిర్యాదులపై ఆయన స్పందించారు. ‘మంచి చేస్తున్నా ఎందుకిలా ప్రవర్తిస్తున్నారంటూ..’ అక్రమార్కుల తీరుపై మండిపడ్డారు.
ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ గా ‘చితా విజయ్ ప్రతాప్ రెడ్డి’ ఏనాడైతే బాధ్యతలు చేపట్టారో.. ఆనాటి నుంచి సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర పరిధిలో ఎన్నో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు ఉన్నప్పటికీ.. వినపడుతోంది మాత్రం ఈ ఒక్క పేరే. ఆయన పేరు చెబితే చాలు అవినీతిపరులు జడుసుకోవాల్సిందే. అలా అని ఆయన చేస్తోందీ.. రౌడీయిజం, పెత్తనాధారీ విధానం కాదు.. నాణ్యమైన అన్నాన్ని పిల్లలకు అందించాలన్నదే ఆయన తాపత్రయం. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఆహార నాణ్యత, పర్యవేక్షణ గురించి ఆరా తీస్తుంటారు. విరామం లేకుండా నిత్యం హాస్టల్స్, స్కూల్స్ సందర్శిస్తుంటారు. వాస్తవంగా చెప్పాలంటే.. బాధ్యతాయుతంగా ప్రవర్తించే ప్రభుత్వ అధికారి.
విజయ్ ప్రతాప్ రెడ్డి ఫుడ్ కమిషన్ చైర్మన్ గా భాద్యతలు చేపట్టాక ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 500 కు పైగా హాస్టల్స్ ను తనిఖీ చేసుంటారు. వెళ్లిన ప్రతి చోటా గదులు, వంటశాలలు పరిశీలిస్తారు. కేర్ టేకర్లు, ఇంఛార్జీలు, వార్డెన్లు, పిల్లలు ప్రతి ఒక్కరితో మాట్లాడుతారు. పిల్లలకు అందించే ఆహారంపై.. ఎలాంటి మెనూ పెడుతున్నారనే దానిపై ప్రశ్నిస్తారు. బడికొచ్చే పిల్లలం స్వంత బిడ్డలుగా భావించి నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచిస్తుంటారు. కానీ, అక్రమార్కులకు ఇది నచ్చట్లేదు. తనిఖీల పేరిట ఫుడ్ కమిషన్ చైర్మన్ భయపెడుతున్నారంటూ పైఅధికారులకు పిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనపై వస్తోన్న ఫిర్యాదులపై ఆయన స్పందించారు.
“ఏమమ్మా.. పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలని నేను చేస్తున్న ప్రయత్నం తప్పా. నా విధులు అవే కదా! ప్రభుత్వం జీతం ఇస్తోంది అందుకే కదా! నా పని చేయోద్దంటారా! తనిఖీలు చేయొద్దండి..? తనిఖీలు ఆపేయండి..? అని ఎందుకు కోరుతున్నారు. మీరు తప్పు చేస్తూ పట్టుపడతారన్న భయమా..? మీపై దాడులు చేశామా..? గట్టిగ మాట్లాడుతున్నందున మాత్రాన మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదు. నాణ్యమైన ఫుడ్ అందిస్తే నేనెందుకు మిమ్మల్ని ప్రశ్నిస్తాను. బాగున్నప్పుడు బాగుంది అంటాం.. బాగోలేనప్పుడు.. మంచిగా పెట్టాలని సర్ధిచెప్తాం.. మరీ బాగాలేనప్పుడు తప్పిస్తాం.. ఇవే నా విధులు. నలుగురికి మంచి చేయాలన్నా నా ఆలోచన ఎప్పటికీ తప్పు కాదు..” అంటూ విజయ్ ప్రతాప్ రెడ్డి తనపై పైఅధికారులకు పిర్యాదు చేస్తోన్న వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.