మంచి చేసే నాయకుడు, ప్రభుత్వాధికారులు అరకొరగా కనపడుతున్న రోజులివి. కనపడనప్పుడు ఇలాంటి బాధ్యతాయుతంగా పని చేసే అధికారులు ఎందుకు రారు.. అని మనలో మనమే ప్రశ్నించుకుంటాం.. అదే మనమీదకు వచ్చేసరికి ఆయన తీరు బాగోలేదంటూ ప్రశ్నిస్తాం.. ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ పై వస్తోన్న పిర్యాదులే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
నేటి సమాజంలో నిజాయితీ అనేది కనుమరుగైపోతుంది. ముఖ్యంగా అవినీతి సొమ్ము కోసం ఆరాటపడే వాళ్లు బాగా పెరిగిపోయారు. చిన్నపిల్లలకు అందించే ఆహార పదార్ధాల నుంచి పెద్ద పెద్ద వస్తువుల వరకు ప్రతి దానిలోనూ అవినీతికి పాల్పడుతున్నారు. పసి పిల్లల కోసం ఏర్పాటు చేసిన అంగన్ వాడీ కేంద్రాల్లో కూడా దోచుకునే వారు పెరిగిపోయారు. పిల్లల కోసం ప్రభుత్వం అందించే ఆహార పదార్ధాలు, పాలు ఇతర వస్తువులను అంగన్ వాడీలో పని చేసే వారిలో కొందరు దొడ్డి దారిన […]