ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ ఏర్పాటుపై గవర్నర్‌తో సీఎం జగన్ చర్చించారు. ఈ నెల 11న మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు గవర్నర్‌కి తెలిపారు. అదే రోజున నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని గవర్నర్‌ను కోరారు. గవర్నర్‌తో భేటీ అనంతరం మంత్రి వర్గ విస్తరణ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ఇదిలా ఉండగా గురువారం సాయంత్రం 3 గంటలకి క్యాబినెట్ సమావేశం కానుంది.