దేశంలో ఇంధన ధరలతో పాటు నిత్యవసరాలు, కూరగాయలు, ఇలా అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు టమాటా సామాన్యుల చేత కంటతడి పెట్టించగా.. ఇప్పుడు పచ్చిమిర్చి.. కొనకుండానే ఘాటు పుట్టిస్తోంది. ఇక అసలే వేసవికాలం కావడంతో.. చల్లని నిమ్మకాయ రసం తాగి సేద దీరుదామనుకువారికి ఆ అవకాశం కూడా లేకుండా పోయే సూచనలు కనిపిస్తున్నాయి. నిమ్మ ధర చూసిన జనాలు.. అమ్మో అంటున్నారు. ఎందుకంటే మార్కెట్‌లో నిమ్మ కాయాలు ఏకంగా కిలో 120 రూపాయలుగా ఉంది. దాంతో నిమ్మకాయలు కొందామంటేనే జనాలు భయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: బూరెలతో ఎమ్మెల్యే తులాభారం.. ఏకంగా 9వేల బూరెలతో..
రెండు నెలల వరకు కిలో 40 రూపాయల వరకు ఉన్న నిమ్మకాయల ధర ప్రస్తుతం అమాంతం ఒక్కసారిగి పెరిగిపోయింది. ప్రస్తుతం కేజీ నిమ్మ 120 రూపాయలు పలుకుతుంది. హోల్‌ససేల్ ప్రకారం ఒక్కొ నిమ్మకాయ 5 రూపాయలు ఉండటంతో.. చిల్లర వర్తకలు ఎంతకు అమ్మాలో అర్థం కాక సతమతమవుతున్నారు. గతంలో రాజమండ్రి, విజయనగరం ప్రాంతాల నుంచి నిమ్మకాయల లోడు వస్తుండగా.. ప్రస్తుతం గూడురు ప్రాంతాల నుంచి వస్తున్నాయని.. అందుకే ధరలు ఇంత భారీగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. దీనిపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.