పోలీసులు అంటేనే కర్కషత్వానికి మరో పేరు అనుకుంటారు కొందరు. కానీ వారిలో కూడా జాలి, దయ ఉంటుందన్న అనేక సంఘటనలు మనం చూశాం. గత కొన్ని రోజుల క్రితం ఇండియా-ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్ లో తొక్కిసలాట జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ గాయపడితే.. ఆమెకు నోటి ద్వారా గాలి అందించి ప్రాణాలు కాపాడింది అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్. ఆ ఘటన మరువక ముందే.. మరోసారి పోలీసులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. గుండెపోటు కు గురై కుప్పకూలిన వ్యక్తికి CPR చేసి బతికించారు పోలీసులు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
అమరావతిలో రైతుల పాదయాత్ర తారాస్థాయికి చేరుకుంది. వేలాదిగా రైతులు పాదయాత్రలో పాల్గొంటూ.. ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడానికి సాయ శక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అనేక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తూ.. ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం అమరావతి మహా పాదయాత్రలో ఓ సంఘటన చోటు చేసుకుంది. పాదయాత్ర చేస్తున్న క్రమంలో ఓ రైతు ఉన్నట్లుండి అక్కడే కుప్పకూలాడు. ఇది గమనించిన ఓ పోలీసు అధికారి.. వెంటనే అతడికి CRP చేశాడు. కొద్ది సేపు ప్రాథమిక చికిత్స అనంతరం ఆ వ్యక్తిలో కదలికలు వచ్చాయి. ప్రస్తుతం పోలీసు అధికారి సీఆర్పీ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దాంతో పోలీసు పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాధారణంగా గుండెపోటు వచ్చిన వ్యక్తికి ప్రాథమిక చికిత్సగా సీఆర్పీ చేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక పాదయాత్రలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు అధికారి సమయం వృథా చేయకుండా వెంటనే చికిత్స ను అందించాడు. అనంతరం అతడిని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తరలించారు.
CPR చేసి రైతును బతికించిన పోలీస్#HatsoffPolice #Farmer #PoliceSavedFarmer pic.twitter.com/qL7sMHtbi1
— Indian Social Media (@NagarjunaWriter) October 18, 2022