నారా లోకేష్.. టీడీపీ జాతీయాధ్యక్షుడు చద్రబాబు నాయుడి కొడుకుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం రాజకీయాల్లో దూకుడుగా ముందుకు వెళ్తున్నాడు. ఇక త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు లోకేష్. 400 రోజుల పాటు.. 4000 కిలోమీటర్ల మేర.. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నాడు లోకేష్. ఈ నెల 23న లోకేష్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో ఓ యువరైతు.. టీడీపీ యువనేతకు అదిరిపోయే గిప్ట్ ఇచ్చాడు. ప్రసుత్తం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ ఫోటో చూసిన నెటిజనులు.. సూపర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు..
టీడీపీ యువ నేత లోకేష్‌కు ఓ అమరావతి యువ రైతు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. అభిమాన నేత పుట్టినరోజు సందర్భంగా.. లోకేష్ ఫొటో రూపంలో వరిపంట పండించాడు. అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు మండలం ఉద్దండరాయనిపాలెంకు చెందిన పులి చిన్నాకు.. టీడీపీ నేత లోకేష్ అంటే చాలా అభిమానం. ఈ క్రమంలో తన అభిమాన నాయకుడి పట్ల తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకోవాలనుకున్నాడు. అందుకోసం కాస్త భిన్నంగా ఆలోచించి ఇలా లోకేష్ రూపంలో వరి పంట పండించి.. తన అభిమానాన్ని చాటుకున్నాడు.
ఇక చిన్నా అమరావతి ఉద్యంలో కూడా రైతుల తరఫున పాల్గొన్నాడు. త్వరలోనే లోకేష్.. యువగళం పేరుతో.. కుప్పం నుంచి ప్రారంభించబోయే పాదయాత్ర విజయవంతం కావాలని.. ఇలా పచ్చని పంట ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నట్లు తెలిపాడు చిన్నా. ఎకార పొలం కౌలుకు తీసుకున్న చిన్నా.. అందులో 70 సెంట్లలో లోకేష్ ఫొటో రూపంలో వరిపంట పండించాడు. ఈ నెల 23న లోకేష్ పుట్టినరోజు సందర్భంగా.. ఇందులో పండించిన వరి ధాన్యాన్ని లోకేష్‌కు గిఫ్ట్‌గా అందించనున్నట్లు చెబుతున్నాడు చిన్నా.
రేపు అనగా జనవరి 23న సోమవారం నారా లోకేష్ తన బర్త్ డేను జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా అభిమానులు లోకేష్ బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలానే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కేక్ కట్ చేసి లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించనున్నారు. అలానే రాష్ట్రవ్యాప్తంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 27 నుంచి లోకేష్ యువగళం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది.
ఇక పాదయాత్రలో భాగంగా లోకేష్.. రోజుకు 10 కిలోమీటర్ల చొప్పున నడవనున్నారు. కుప్పంలో ప్రారంభం కానున్న లోకేష్ పాదయాత్ర.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు సాగనుంది. సుమారు 4 వేల కిలోమీటర్ల మేర.. 400 రోజుల పాటు పాదయాత్ర చేపట్టనున్నారు. లోకేష్ పాదయాత్రకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఇప్పటికే డీజీపీని కలిసి టీడీపీ లేఖ అందించింది. మరి లోకేష్‌కు ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉంది.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Greatest tribute to Lokesh so far 💥
Advance Happy Birthday Anna @naralokesh pic.twitter.com/Yj1U88sFLr
— బాబు కోసం (@trollysrcp) January 22, 2023