రాజకీయాలను ప్రక్షాళన చేయాలని సద్దుదేశంతో ఈ రంగంలోకి అడుగుపెడుతుంటారు. చిన్న ఉద్యోగులే కాదూ ఐఎఎస్, ఐపీఎస్‌లు సైతం తమ విధులకు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు.. వస్తున్నారు. కానీ ఈమె కాస్త భిన్నం. ఉద్యోగం కోసం ఆమె రాజకీయాల నుండి వైదొలిగింది.
రాజకీయాల్లోకి వచ్చేందుకు చాలా మంది తమ ఉద్యోగాలను వదిలిపెడుతుంటారు. రాజకీయాలను ప్రక్షాళన చేయాలన్న సద్దుదేశంతో ఈ రంగంలోకి అడుగుపెడుతుంటారు. చిన్న ఉద్యోగులే కాదూ ఐఎఎస్, ఐపీఎస్‌లు సైతం తమ విధులకు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. అరవింద్ కేజ్రీవాల్, జయప్రకాష్ నారాయణ, జేడీ లక్ష్మి నారాయణ ఆ కోవకు చెందిన వారే. వీరిలో అరవింద్ క్రేజీవాల్ ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కానీ, ఆమె కాస్త విభిన్నం, ఉద్యోగం కోసం రాజకీయాలను విడిచిపెట్టేందుకు సిద్ధమైంది. ఇంతకు ఆమె వదులుకున్నరాజకీయ పదవి ఏంటంటే..?
టీచర్ ఉద్యోగం కోసం మున్సిపల్ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసేసిందో మహిళ. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే అన్నమయ్య జిల్లా మదనపల్లిలో. వివరాల్లోకి వెళితే..మదనపల్లి మున్సిపాలిటీ 8వ వార్డు నుంచి గీతాశ్రీ టీడీపీ తరపున కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. అయితే బీఎడ్ చేసిన ఆమె 1998లో డీఎస్సీ పరీక్ష రాశారు. అప్పట్లోనే సెలక్ట్ అయ్యారు. అయితే ఆ సంవత్సరంలో డీఎస్సీ వివాదం కావడంతో పోస్టింగ్ ఇవ్వడంలో జాప్యం చోటుచేసుకుంది. అయితే ఇటీవల వీరికి పోస్టింగ్ వచ్చిన సంగతి విదితమే. ఈ నెల 13న గీతాశ్రీని టీచర్‌గా నియమిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
టీచర్ కావాలన్న తన ఇన్నాళ్లకు నేరవేరడంతో ఆమె తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసేశారు. ఆమె రాజీనామాను మదనపల్లి మున్సిపల్ కమిషనర్ వెంటనే ఆమోదించారు. టీచర్‌గా బడిలో పాఠాలు చెబుతున్నారు. తనపై నమ్మకం ఉంచి కౌన్సిలర్‌గా గెలిపించిన తన వార్డు ప్రజలకు పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నందుకు తనను మన్నించాలని గీతాశ్రీ తన వార్డు ప్రజలను కోరారు. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నప్పటికీ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. అన్నట్టు గీతాశ్రీకి వచ్చింది రెగ్యులర్ టీచర్ జాబ్ కాదు. కాంట్రాక్ట్ విధానంలోనే ఈమెను టీచర్‌గా ప్రభుత్వం నియమించింది. నెల జీతం 32,670 రూపాయలు మాత్రమే. హైకోర్టు ఆదేశాలకు లోబడి ఈ నియామకం ఉంటుందని నియామక ఆదేశాల్లో డీఈఓ స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ ఆమె ఈ ఉద్యోగంలోకి రావడం గమనార్హం.