మోసం చేసే వాడిదే కాదూ.. మోసపోయే వాడిదే తప్పు అన్న చందంగా తయారయ్యింది నేటి తీరు. ఇక అమ్మాయిలతే కిలేడీలుగా మారిపోతున్నారు. ప్రేమ పేరుతో మోసం చేయడంలో అబ్బాయిలను ఏ మాత్రం తీసిపోవడం లేదు.
ప్రేమ పేరుతో నయా వంచనకు తెర లేపుతున్నారు నేటి యువత. వ్యసనాలకు, జల్సాలకు అడ్డుదారులు తొక్కడమే కాదూ..ప్రేమ పేరిట వలపన్ని, వలపుల వల విసిరి.. దొరికినంత దోచుకుంటున్నారు. వారిది ప్రేమ కాదని, అవసరానికే వినియోగించుకుంటున్నారని నిజం తెలిసే సరికి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. మోసం చేసే వాడిదే కాదూ.. మోసపోయే వాడిదే తప్పు అన్న చందంగా తయారయ్యింది వీరి తీరు. ఇక అమ్మాయిలతే కిలేడీలుగా మారిపోతున్నారు. ప్రేమ పేరుతో మోసం చేయడంలో అబ్బాయిలను ఏ మాత్రం తీసిపోవడం లేదు. ప్రేమ పేరుతో దగ్గరయ్యి.. భారీ స్కెచ్ వేసింది ఓ మహిళ. లక్షలు దండుకుని ఉడాయించింది.
ప్రేమికుడ్ని కిడ్నాప్ చేసి 21 లక్షలు దోచుకున్న ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. చిక్‌బల్లాపూర్ జిల్లా నంది హిల్స్ సమీపంలోని ఓ రిసార్టులో జరిగింది. ఆ ప్రేమికుడిది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనంత పురం జిల్లా. వివరాల్లోకి వెళితే.. అనంతపురానికి చెందిన విజయ్ సింగ్ (32) బెంగళూరులో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి బాగా ఆస్తిపాస్తులున్నాయన్న గ్రహించిన భావనా రెడ్డి అతడిని ప్రేమలో పడేసింది. అయితే డేటింగ్‌కు వెళదామని ఫోన్ చేసి పిలిచింది భావన. దేవన హళ్లికి బయలు దేరుతుండగా.. సినీ ఫక్కీలో అతడిని కిడ్నాప్ చేయించింది. నంది హిల్స్ సమీపంలోని క్యూ వీసీ విల్లా రిస్టార్టుకు తీసుకెళ్లారు. మొత్తం ఆరుగురు కలిసి అతడిని కిడ్నాప్ చేశారు. రిసార్టుకు తీసుకెళ్లిన తర్వాత.. అందరూ కలిసి అతడిపై దాడి చేశారు.
డబ్బులు కోసం హింసించడం మొదలు పెట్టారు. సుమారు మూడు రోజుల పాటు అతడ్ని బంధించి.. చిత్ర వధకు గురి చేశారు. రూ. 21 లక్షలు తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు. అంతే కాకుండా 2 ల్యాప్‌టాప్‌లు, 3 మొబైల్ ఫోన్లు, 12 గ్రాముల బంగారు గొలుసు చోరీ చేశారు. జూన్ 16 నుంచి 18వ తేదీ వరకు.. మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురయ్యాడు. ఆ తర్వాత అతడిని విడిచి పెట్టారు. దీంతో అతడూ లబోదిబో మందటూ పోలీసులను ఆశ్రయించాడు. ప్రియురాలు భావనారెడ్డి ఆమెకు సహకరించిన పుల్లారెడ్డి, సుబ్రమణి, నాగేశరెడ్డి, సిద్దేష్, సుధీర్‌లపై ఫిర్యాదు చేశారు. ఐపీసీలోని 506,341,504,143,149,384, 323, 324 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.