పశ్చిమ గోదావరి జిల్లాలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కుక్కల దాడిలో గాయపడ్డ కోతిని గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే వైద్యులు ఆ కోతికి చికిత్స చేస్తుండగా శరీరం నుంచి బుల్లెట్ బయటపడింది. దీంతో వైద్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విషయం ఏంటంటే? ఉండిమండలం చెరుకువాడ గ్రామంలో ఓ కోతి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడింది. దీంతో స్పందించిన చెరుకువాడ గ్రామస్తులు వెంటనే ఆ కోతిని ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: దారుణం: కల్తీ సారా తాగి 9 మంది అమాయకులు మృతి!
అలెర్ట్ అయిన వైద్యులు గాయపడ్డ కోతికి చికిత్స చేస్తుండగా కోతి శరీరం నుంచి ఓ బుల్లెట్ బయటపడింది. అయితే ఈ కోతిని చెరుకువాడ గ్రామస్తులు ఆస్పత్రికి తీసుకొచ్చారని వైద్యులు చెబుతున్నారు. అయితే కోతి శరీరంలోకి అసలు బుల్లెట్ ఎలా వెళ్లింది? ఎవరు తుపాకితో కాల్చారు? ఏంటనే పూర్తి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కోతి శరీరంలో కనిపించిన బుల్లెట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.