పవిత్ర తిరుమల క్షేత్రం చుట్టూ వివాదాలు నెలకొంటున్నాయి. ఇటీవలే తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ హల్చల్ చేయడం, డ్రోన్ ఎగరేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయడం మనం చూశాం. ఈ ఘటన మరువక ముందే తిరుమలలో మరో ఘటన చోటు చేసుకుంది. పవిత్ర తిరుమల క్షేత్రంలో డ్రోన్ కలకలం వివాదం ముగియక ముందే మరో వివాదం కలకలం రేపింది. ఏకంగా లడ్డూ కౌంటర్ లోనే దొంగతనం జరిగింది. సోమవారం అర్థరాత్రి 36వ కౌంటర్ లో చోరీ జరిగింది. కౌంటర్ సిబ్బంది నిద్రిస్తున్న సమయంలో ఒక దొంగ 2 లక్షలకు పైగా సొమ్మును ఎత్తుకెళ్లాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై టీటీడీ సీరియస్ అయ్యింది.
మొదటి పట్టణ పోలీస్ స్టేషన్ లో టీటీడీ అధికారులు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ అధికారులు, పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ లో నిందితుడ్ని గుర్తించారు. గతంలో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తే దొంగతనం చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం దొంగ పరారీలో ఉన్నాడు. దొంగను పట్టుకోవడానికి ప్రత్యేక టీములు ఏర్పాటు చేశారు అధికారులు. అయితే విజిలెన్స్ అధికారుల లోపం వల్ల జరిగిందా? లేక దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి తిరుమల క్షేత్రంలో లడ్డూ కౌంటర్ లో 2 లక్షలు చోరీకి గురవ్వడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.