చదువు చెప్పాల్సిన గురువే కామాంధుడిగా మారితే ఆ పసిపిల్లల పరిస్థితి ఏమిటి? అమ్మలా కాపాడాల్సిన పాఠశాలే భయానక వాతావరణంగా మారితే పిల్లల భవిష్యత్తు ఎటు పోవాలి? చిత్తూరు జిల్లా వి.కోటలోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెచ్చేలా ఒక టీచర్ చేస్తున్న వికృత చేష్టలు, వాటిని కప్పిపుచ్చేందుకు హెడ్మాస్టర్ చేస్తున్న ప్రయత్నాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. చిత్తూరు జిల్లా […]