అనంతపురం జిల్లా రాప్తాడులో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. బాలికకు బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యులు నిర్వహించిన కీలకమైన ఆర్థోపెడిక్ సర్జరీ విజయవంతమైంది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్వయంగా ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ప్రభుత్వం బాలికకు పూర్తి ఉచితంగా అత్యుత్తమ వైద్యం అందిస్తోందని, బాధితురాలి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. బెంగళూరులోని కార్పొరేట్ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య బృందం ఈ ఆపరేషన్ […]