బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నవంబర్ 13 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది వాయువ్య దిశగా కదులుతూ తదుపరి 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. అనంతరం నవంబర్ 15 నాటికి వాయుగుండంగా మారవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే నవంబర్ 16, 17 తేదీల్లో […]