కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీని పోలీసులు ఒక గదిలో నిర్బంధించారు. ఆమె ఆ గదిని చీపురుతో శుభ్రం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనల్లో ఆదివారం అల్లర్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ హింసాకాండలో 8 రైతులు మరణించారు. వారి కుటుంబాలను పరామర్శించేందుకు ప్రియాంకగాంధీ ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాకు వెళ్తుండగా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. రైతులు మరణిస్తే వారి కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు […]