ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షసూచన జారీ అయింది. అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడ్రోజులు వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసి..అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఐఎండీ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఈ నెల 22వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఫలితంగా రానున్న మూడ్రోజులు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలతో పాటు […]
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరో 3-4 రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఫలితంగా ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులిచ్చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టినా ఏపీలో దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం విశాఖపట్నం సమీపంలో కేంద్రీకృతం కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉంది. ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతుండగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో దంచి కొడుతున్నాయి. లోతట్టు […]
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పూర్తిగా బలపడింది. ఫలితంగా రానున్న 4-5 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రెడ్ అలర్ట్ జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలో ముందస్తుగా ప్రవేశించినా ఆశించిన వర్షపాతం కురవలేదు. కానీ గత వారం రోజులుగా సాధారణానికి మించి నమోదవుతోంది. మొన్నటి వరకు లోటు వర్షపాతం ఎదుర్కొన్న గుంటూరు, అన్నమయ్య, వైఎస్సార్ […]
తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో కూడా పిడుగులు, వడగండ్లతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కురిసిన భారీ వర్షాలకు పిడుగు పాటుకు గురై ఓ యువతి మృతి చెందిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో జనం ఎవరూ కూడా బయటకి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఏపీలో అయితే వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ కూడా హెచ్చరించించి. అయితే ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా ఒక యువతి సాహసం చేసింది. పీకల్లోతు […]
విశాఖపట్నం- ఆంద్రప్రదేశ్ కు విశాఖపట్నం వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. రెండు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మహారాష్ట్రలోని విదర్భ పరిసర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. మహారాష్ట్ర మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావావరణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపురాయలసీమ, కోస్తా ప్రాంతంలో ఎండ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రానున్న రెండు, మూడు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. […]