ఆధ్యాత్మిక క్షేత్రమైన భద్రాచలంలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. కేవలం రూ.100 కోసం లాడ్జి సిబ్బంది ఓ యువకుడిని కొట్టి చంపారు. నిందితులు యువకుడు యాక్సిడెంట్ లో చనిపోయాడనుకునే విధంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భద్రాచలం పట్టణంలోని ప్రసిద్ధ రామాలయం ఏరియాలో ఈ దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న తెల్లం శరత్ అనే యువకుడి వద్దకు హైదరాబాద్ నుంచి […]