దేశానికి అన్నం పెట్టే అన్నదాత కన్నీరు పెడితే ఆ దేశం సుభిక్షంగా ఉండదు. సరిగ్గా ఇదే ఆందోళనకర పరిస్థితి ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో కనిపిస్తోంది. ఎల్నినో ప్రభావంతో వరుణుడు ముఖం చాటేయడంతో, వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయి కోలుకోలేని దెబ్బతిన్నాయి. ఈ కఠిన పరిస్థితుల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు ఓ మంచి శుభవార్త చెప్పింది. అర్హులైన ప్రతి రైతుకు రూ.5,000 ఆర్థిక సాయాన్ని దీపావళికి ముందే నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. […]