SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » reviews » Nani Dasara Movie Review Telugu

'దసరా' మూవీ రివ్యూ

ఇండస్ట్రీలో ఒక్కో టైంలో ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. గత కొన్నాళ్ల నుంచి వచ్చిన సినిమాలనే చూసుకుంటే ఎక్కువగా రస్టిక్ మాస్ ఎంటర్ టైనర్స్ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. వాటిలో పుష్ప, KGF లాంటి మూవీస్ చాలా అంటే చాలా క్రేజ్ తెచ్చుకున్నాయి.

    Updated On - Mon - 17 April 23
    • facebook
    • twitter
    • |
        Follow Us
      • Suman TV Google News

దసరా

30-03-2023, యాక్షన్ ఎమోషనల్ డ్రామా, 2h 39m U/A
థియేటర్స్ లో
  • నటినటులు:నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, సాయికుమార్ తదితరులు
  • దర్శకత్వం:శ్రీకాంత్ ఓదెల
  • నిర్మాత:సుధాకర్ చెరుకూరి
  • సంగీతం:సంతోష్ నారాయణన్
  • సినిమాటోగ్రఫీ:సత్యన్ సూర్యన్

Rating

3/5

ఇండస్ట్రీలో ఒక్కో టైంలో ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. గత కొన్నాళ్ల నుంచి వచ్చిన సినిమాలనే చూసుకుంటే ఎక్కువగా రస్టిక్ మాస్ ఎంటర్ టైనర్స్ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. వాటిలో పుష్ప, KGF లాంటి మూవీస్ చాలా అంటే చాలా క్రేజ్ తెచ్చుకున్నాయి. పాన్ ఇండియా వైడ్ థియేటర్స్ ని షేక్ చేసి, వందలకోట్ల కలెక్షన్స్ సాధించాయి. ఇప్పుడు ఇదే జానర్ లో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మూవీ ‘దసరా’. రిలీజ్ కు ముందే చాలా అంచనాలు పెంచిన ఈ మూవీ తాజాగా శ్రీరామనవమి సందర్భంగా థియేటర్స్ లోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం!

కథ:

వీర్లపల్లి అనే పల్లెటూరు. చుట్టు బొగ్గు కుప్పలు, మైన్స్. ఈ ఊరిలోనే ధరణి(నాని), సూరి (దీక్షిత్ శెట్టి), వెన్నెల(కీర్తి సురేష్) కలిసి మెలిసి పెరుగుతారు. వెన్నెలని స్కూల్ లో ఉన్నప్పుడే ధరణి ప్రేమిస్తాడు. కానీ సూరి కూడా వెన్నెలనే లవ్ చేస్తున్నాడని తెలిసి.. తన ప్రేమని మనసులోనే దాచేసుకుంటాడు. ఆ తర్వాత చాలా భయస్థుడిగా మారిపోయి మందుకు బాగా అలవాటు అయిపోతాడు. ఫ్రెండ్స్ తో కలిసి బొగ్గు దొంగతనం చేస్తూ బతికేస్తుంటాడు. కట్ చేస్తే కొన్నాళ్లకు పెద్దల అంగీకారంతో వెన్నెల, సూరి పెళ్లి చేసుకుంటారు. దీనికి ధరణినే సహాయం చేస్తాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఊరిలో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. చాలా భయపడే ధరణి.. కత్తి పట్టి మనుషుల్ని చంపే స్థాయికి వెళ్లిపోతాడు? ధరణి ఎందుకలా మారాల్సి వచ్చింది? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే మీరు ‘దసరా’ని థియేటర్లలో చూడాల్సిందే.

విశ్లేషణ:

‘దసరా’.. ఔట్ అండ్ ఔట్ మాస్ కమర్షియల్ సినిమా. అలా అని స్టోరీ విషయంలో కత్తి విడిచి సాము చేయలేదు. ఏదో కొత్తగానూ ప్రయత్నించలేదు. మనలో చాలామందికి తెలిసిన కథనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. చాలా భయపడే హీరో.. అనుకోని పరిస్థితుల్లో కొన్ని కారణాల వల్ల మనుషుల్ని చంపడం అనే పాయింట్ కొత్తేం కాదు. ఇప్పటివరకు చాలా సినిమాల్లో చూశాం. కానీ వాటికి దీనికి తేడా ఏంట్రా అంటే ట్రీట్ మెంట్. తీస్తుంది మాస్ సినిమానే అయినా ప్రతి విషయానికి డీటైలింగ్ ఇస్తూ వెళ్లారు. స్టోరీ దగ్గర నుంచి హీరోహీరోయిన్, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ని చాలా చక్కగా డిజైన్ చేసుకున్నారు. ధరణి అంటే భూమి, వెన్నెల అంటే చందమామ, సూరి అంటే సూర్యుడు. ఈ మూడు కూడా ఎప్పుడూ కలిసే ఉంటాయి. సినిమాలోనూ వీళ్ల సీన్ ఉందంటే అందులో చాలా సీన్లలో ముగ్గురూ కంపల్సరీగా ఉంటారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి ఎలాంటి పక్కచూపులు లేకుండా ఏదైతే చెప్పాలనుకున్నారో క్లియర్ గా అదే చెప్పారు. సినిమాలో ఫుల్ యాక్షన్ ఉంటుంది కదా అని అనుకోని మాత్రం వెళ్లకండి. ఒకవేళ అలా అయితే మాత్రం కచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే యాక్షన్ కంటే డ్రామా, ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. చెప్పాలంటే అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి.

ఫస్టాఫ్ విషయానికొస్తే.. వీర్లపల్లిలోని సిల్క్ బార్ లో ఊరి వాళ్లందరూ మందు తాగుతుంటారు. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మద్యపాన నిషేధం చేస్తున్నాం అని చెప్పడం టీవీలో వస్తుంది. ఇది చూసి మందుబాబులకు షాకవుతారు. ఆ తర్వాత నుంచి వీర్లపల్లిలో రాజకీయాలు షురూ అవుతాయి. ఇలా తొలి భాగం అంతా కూడా వీర్లపల్లి, అందులోని మనుషుల మనస్తత్వాలు, కులాల మధ్య తేడాలో ఇలా ఒక్కొక్కటి చూపిస్తూ పోయారు. ధరణి, సూరి, వెన్నెల క్యారెక్టర్స్ చాలా చక్కగా డిజైన్ చేసుకున్నారు. చెప్పాలంటే ఫస్టాఫ్ లో ధరణి పాత్ర కంటే సూరినే ఎక్కువగా హైలైట్ అవుతాడు. ఇక సూరి-వెన్నెల పెళ్లి ఫిక్స్ కావడానికి ధరణినే హెల్ప్ చేస్తాడు. తీరా పెళ్లి జరుగుతున్న టైంలో ఓ చోటకి వెళ్లి బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత కొంతసేపటికే స్టోరీలో హీరో ట్రిగర్ అయ్యే పాయింట్ వస్తుంది. అప్పుడే ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. అయితే ఇంటర్వెల్ లో ఫైట్ ఉంటుందని ప్రేక్షకులు ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ అలాంటిదేం లేకుండా ‘విరామం’ అని పడుతుంది.

ఫస్టాఫ్ అంతా ఆల్మోస్ట్ డ్రామాతో నడిపించేశారు. సెకండాఫ్ కి వచ్చేసరికి అటు ఎమోషన్ తో పాటు యాక్షన్ ని నమ్ముకున్నారు. ధరణి పాత్రలో అసలు సిసలైన మాస్ ని ఒక్కో సీన్ తో ఎలివేట్ చేస్తూ వెళ్లారు. వెన్నెలని ఏడిపించారని ఊరిలోని ఓ వ్యక్తిని దాదాపు చంపేవరకు ధరణి వెళ్తాడు. అక్కడే విలన్ చిన నంబికి ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తాడు. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల.. ‘దసరా’ డైరెక్టర్. అందుకేనేమో ఏమోగానీ.. ఓ రెండు సీన్స్ లో సుకుమార్ తీసిన ‘రంగస్థలం’ షేడ్స్ కనిపిస్తాయి. బార్ లోకి నాని ఎంట్రీ సీన్.. రంగస్థలంలో జగపతిబాబుకి రామ్ చరణ్ వార్నింగ్ సీన్ తో కాస్త పోలినట్లు అనిపిస్తుంది. ‘దసరా’ ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఓ ఎమోషనల్ సాంగ్.. ‘రంగస్థలం’లోని ‘ఓరయ్యో.. ‘ పాటని గుర్తు చేస్తుంది. ఇది తప్పించి మిగతా ఎక్కడా కూడా మనకు వేరే ఏం గుర్తుకురాదు. దసరా క్లైమాక్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పటివరకు ధరణి ఎప్పుడు ఫైట్ చేస్తాడా అని ఆడియెన్స్ ఒకటే ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. క్లైమాక్స్ చివరి 20 నిమిషాలైతే మనకు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అలా ఉంటుంది ఆ ఫైట్. ఎక్కువ చెబితే మళ్లీ స్పాయిలర్ అయిపోతుంది. కాబట్టి థియేటర్ లో ఆ క్లైమాక్స్ ఫైట్ ని ఎక్స్ పీరియెన్స్ చేయండి. మీకు రోమాలు నిక్కబొడుచుకోకపోతే నన్ను అడగండి.

నటీనటుల పనితీరు:

ఈ సినిమా చూడగానే మీకు నాని, కీర్తి సురేష్ తెగ నచ్చేస్తారు. ఇప్పటివరకు వీళ్లిద్దరూ ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేశారు కానీ ‘దసరా’ మాత్రం వీళ్ల కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫెర్ఫార్మెన్స్. నాని యాక్టింగ్ అయితే ఫ్యాన్స్ ని చాలా అంటే చాలా సర్ ప్రైజ్ చేస్తుంది. క్లైమాక్స్ ఫైట్ ఎపిసోడ్ లో విలన్లని చంపుతుంటే.. రాముడు చేసిన రావణ సంహారం గుర్తొస్తుంది. నానికి మీరు ఫిదా అయిపోతారు. దీక్షిత్ శెట్టి, సూరి రోల్ కి ఎంత కావాలో అంత ఫెర్ఫెక్ట్ గా జీవించేశాడు. మిగిలిన వారిలో చిన నంబి క్యారెక్టర్ చేసిన మలయాళ నటుడు సైన్ టామ్ చాకో గురించి చెప్పుకోవాలి. ఓ విలన్ ఎంత కృూరంగా ఉంటాడనేది చిన నంబి రోల్ చూసిన తర్వాత అర్థమవుతుంది. సాయికుమార్, సముద్రఖని లాంటి అద్భుతమైన నటులు ఉన్నప్పటికీ వాళ్లకు స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగానే దొరికింది. ధరణి-సూరి ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్ టీమ్ పనితీరు:

ఈ సినిమా చూస్తున్నంతసేపు స్క్రీన్ పై చాలామంది కనిపిస్తుంటారు. అదే టైంలో డైరెక్టర్ ఎవరు? మ్యూజిక్ ఎవరు? అని మైండ్ లో అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే అంత అద్భుతంగా రఫ్ఫాడించారు. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెలకు ‘దసరా’నే ఫస్ట్ సినిమా. కానీ మూవీ చూస్తున్నంతసేపు ఏ పాయింట్ లోనూ అలా అనిపించదు. పది సినిమాల ఎక్స్ పీరియెన్స్ ఉన్న డైరెక్టర్ లా సినిమాని హ్యాండిల్ చేశాడు. హీరోహీరోయిన్, ఫ్రెండ్ క్యారెక్టర్ విషయంలో ఇచ్చిన డీటైలింగ్ అయితే నెక్స్ట్ లెవల్ ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్.. శివతాండవం ఆడేశాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యాక్షన్ సీన్, ఎమోషనల్ సీన్.. దేనికి ఎంత కావాలో అంతే ఫెర్ఫెక్ట్ గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఇక సినిమాటోగ్రఫర్ సత్యన్ సూర్యన్.. బొగ్గులోనూ అద్భుతమైన ఫ్రేమ్స్ పెట్టి అదరగొట్టాడు. నిర్మాణ విలువలు కూడా చాలా రిచ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే.. థియేటర్లలో ‘దసరా’తో ప్రేక్షకులకు మాస్ జాతర!

ప్లస్ పాయింట్స్:

  • నాని వన్ మ్యాన్ షో
  • మాస్ ఎలిమెంట్స్ ఉన్న స్టోరీ
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
  • శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్

మైనస్ పాయింట్స్:

  • యాక్షన్ సీన్స్ తక్కువగా ఉండటం

చివరగా: ‘దసరా’.. క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవల్ బిగిలు!

రేటింగ్: 3/5

(గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Tags :

  • Cinema News
  • Dasara
  • Keerthy Suresh
  • movie review
  • Nani
  • Srikanth Odela
Read Today's Latest reviewsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Thaman: ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

Thaman: ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

  • ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారులు..ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు

    ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారులు..ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్...

  • ‘మామన్నన్’ లో వడివేలు నటనకు ఫిదా! జాతీయ అవార్డు పక్కా అంటూ!

    ‘మామన్నన్’ లో వడివేలు నటనకు ఫిదా! జాతీయ అవార్డు పక్కా అంటూ!

  • షికారుకొచ్చిన షేర్‌లా చిరు! భోళా శంకర్‌ దెబ్బకి బాక్సాఫీస్ షేకే

    షికారుకొచ్చిన షేర్‌లా చిరు! భోళా శంకర్‌ దెబ్బకి బాక్సాఫీస్ షేకే

  • Raviteja: మాట నిలుపుకున్న రవితేజ.. అతడితో సినిమా చేస్తానంటూ..

    Raviteja: మాట నిలుపుకున్న రవితేజ.. అతడితో సినిమా చేస్తానంటూ..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

తాజా వార్తలు

  • సుధీర్ బాబు సోనాక్షి సిన్హా జటాధర టీజర్‌ స్టోరీ లైన్ ఇదే

  • అల్లు అర్జున్ మిస్ అయిన ఆ సూపర్ హిట్ మూవీ ఏది, ఎందుకు

  • 50MP కెమేరా 12జీబీ ర్యామ్ ఫీచర్లతో తక్కువ ధరకే OnePlus Nord CE5

  • పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పండగే..ఓటీటీలో హరిహర వీరమల్లు ఎప్పుడంటే

  • రజినీకాంత్ ఎత్తుకున్న ఈ బాబుని గుర్తుపట్టారా? తలైవాని తలెత్తుకునేలా చేసిన చిచ్చర పిడుగు..

  • రాఖీ నియమాలు, ఎలా కట్టాలి, ఎన్ని ముడులు వేయాలి, ముహూర్తం ఎప్పుడు

  • రక్షాబంధన్ ఎందుకు ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారా తెలుసా

Most viewed

  • నాగార్జున ఆ సినిమాలో విలన్‌గా ఎందుకు నటించారో తెలుసా?

  • రక్షాబంధన్ ఎందుకు ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారా తెలుసా

  • సూ*సైడ్ చేసుకోవాలన్పించేది. ఆ మూడు నెలలు నరకం అనుభవించాను

  • మహేశ్ ఫ్యాన్స్‌కు నో బర్త్ డే గిఫ్ట్..అంతకు మించి ప్లాన్ చేస్తున్నాడా..?

  • ఏపీ తెలంగాణలో వారం రోజులు భారీ వర్షాలు...

  • ఉప రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదల, ఎన్నిక ఎలా జరుగుందో తెలుసుకోండి

  • కూలీ వర్సెస్ వార్ 2 కలెక్షన్ల జోరు, ప్రీ సేల్స్‌లో ఎవరిది పైచేయి

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam