మద్యం మత్తు… ఇదే మనిషిని ఎంతటి దారుణానికి ఒడిగట్టేలా చేస్తుంది. చివరికి అదే మత్తులో క్షణికావేశంలో కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను హత్య చేయడానికి కూడా వెనకాడరు. ఇకపోతే ఈ రోజుల్లో చాలా మంది వ్యక్తులు మద్యానికి బానిసై కట్టుకున్న భార్యలను అనేక వేధింపులకు గురి చేస్తున్నారు. తాగొచ్చి భార్యను ఇష్టమొచ్చిన రీతిలో తిట్టడం, దాడి చేయడం వంటివి చేస్తున్నారు. దీంతో నాలుగు గొడవల మధ్య భర్త చేసి దారుణాలను చెప్పుకోలేక ఎంతోమంది మహిళలు తమలో తాము కుమిలిపోతున్నారు.
అయితే ఇలాంటి వేధింపులను భరించలేని కొందరు మహిళలు ధైర్యంగా భర్తపై తిరగబడుతున్నారు. అచ్చం ఇలాగే ఓ మహిళ ఒకడుగు ముందుకేసింది. రోజూ తొగొచ్చి వేధిస్తున్న భర్త భరతం పట్టాలని భావించి ఏకంగా నడి రోడ్డుపై భర్త కంట్లో కారం చల్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… సూర్యాపేట జిల్లాలోని కోదడ పట్టణంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త కొంత కాలం పాటు బాగానే సంసారం చేశాడు. అయితే రోజులు గడుస్తున్న కొద్ది భర్త మద్యానికి బానిసయ్యాడు. దీంతో రోజూ మద్యం తాగి ఇంటికొచ్చేవాడు.
ఇక ఇంతటతో ఆగకుండా భార్య అనేక వేధింపులకు గురి చేసేవాడు. ఇన్నాళ్లు భర్త వేధింపులను భరించిన భార్య ఇక తట్టుకోలేకపోయింది. కట్టలు తెంచుకున్న కోపంతో రోజూ వేధిస్తున్న భర్తకు సరైన బుద్ది చెప్పాలని అనుకుంది. ఇందులో భాగంగానే ఇటీవల ఓ రోజు భార్య చేతిలో కారం పట్టుకుని భర్త ఉన్న చోటుకు వెళ్లింది. ఇక నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా భర్త కంట్లో కారం కొట్టింది. ఇదే దృశ్యాన్ని అక్కడున్న స్థానికులు వీడియోలు తీసుకున్నారు. చివరికి అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. అయితే ఇదే ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. తాగి వేధించిన భర్త కంట్లో కారం కొట్టిన ఈ భార్య తీరు కరెక్టెనా? మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి.
— Hardin (@hardintessa143) January 26, 2023