వరుడు చదువుకోలేదని వధువు పెళ్లిపీటల మీదనే షాకిచ్చింది. ఏకంగా పెళ్లికి నిరాకరించి నాకు నువ్వు వద్దంటూ వెళ్లిపోయింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన కాస్త వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీఈడి చదువుకున్న యువతికి ఓ యువకుడితో పెద్దలు నిశ్చితార్థం కుదుర్చారు. యువతికి మాత్రం ఆ యువకుడితో పెళ్లి ఇష్టం లేదు. తల్లిదండ్రుల ఇష్టం మేరకు ఒప్పుకుంది. ఇక పెళ్లి సమయం దగ్గర పడింది. పెళ్లి రోజు కూడా రానే వచ్చింది. పెళ్లిమండపానికి బంధువులంతా హాజరయ్యారు. భాజా బజంత్రీలతో అంతా సందడిగా మారింది.
ఇది కూడా చదవండి: Love Marriage: పదేళ్ల క్రితం విడిపోయిన ప్రేమికులు.. ఇప్పుడు ‘మళ్లీ’ పెళ్లి చేసుకున్నారు!
ఇక తాళిబొట్టుకట్టే సమయానికి వరుడు వధువు మెడలో పూల దండ వేశాడు. వెంటనే వధువు కూడా వేసే ప్రయత్నంలోనే ఊహించలేని షాకిచ్చింది. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని, నేను చదుకోలేని వాడిని పెళ్లి చేసుకోలేనని కరాఖండిగా చెప్పింది. దీంతో వరుడితో పాటు బంధువులంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. దీంతో తాళికట్టే వరకు వచ్చి వివాహం రద్దు కావడంతో వధువు బంధువులంతా తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఇదే ద్రుష్యాన్ని వీడియోను తీసి కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కాస్త వైరల్ గా మారింది. కానీ ఈ తంతు ఎక్కడ జరిగిందే పూర్తి వివరాలు మాత్రం తెలియరాలేదు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.