పాము అంటే భయపడని వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. పామును చూడగానే కొంతమందికి చలి జ్వరం వచ్చేస్తుంది. అది కనబడగానే తుర్రున పారిపోతారు. అలాంటి వారి ఇంట్లోకి పాము దూరితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి?.. ఇంట్లో పాము కనిపించగానే వారి గుండెల్లో దడ మొదలవుతుంది. దాన్ని బయటకు పంపించే వరకు లేదా చంపేవరకు నిద్ర కూడా పట్టదు. పామును చంపటం తమ వల్ల కాకపోతే బయటినుంచి ఎవరినైనా తీసుకువచ్చి చంపిస్తారు కానీ, వారు మాత్రం ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లారు. ఇక, ఇళ్లలోకి పాములు దూరటం అన్నది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. తాజాగా, ఓ వ్యక్తి ఇంట్లోకి పెద్ద నాగుపాము దూరింది. దూరటమే కాదు.. తలుపు దగ్గర ఉన్న రంధ్రంలోకి చేరి పడగ విప్పింది. ఇంట్లోకి వెళ్లాలన్నా.. బయటకు రావాలన్నా దాన్ని దాటుకుని తిరగాల్సిన పరిస్థితి.
అది మాత్రం ఎవ్వరినీ అటువైపు రానివ్వకుండా బుసలు కొడుతూ మీదకు దూకుతూ ఉంది. ఆ ఇంటి వాళ్లు ఏం చేయాలో తెలియక అటు, ఇటు చూస్తూ ఉండిపోయారు. ఓ వ్యక్తి పామును వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేలల్లో వ్యూస్, లైక్స్‌తో దూసుకుపోతోంది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ‘‘ ఇంటికి హై సెక్యూరిటీ ఇస్తోంది పాము’’.. ‘‘ తలుపు దగ్గర ఇంత బందోబస్తు నేను ఎప్పుడూ చూడలేదు’’.. ‘‘ మొరిగే కుక్క కన్నా ఈ పాము సెక్యూరిటీ మేలు’’.. ‘‘ ఇంతకీ ఆ పామును ఏం చేశారు?’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఇంటి తలుపులో పాము బుసలు కొడుతున్న ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The safest security system! 😂 pic.twitter.com/QwSesTD7HE
— Figen (@TheFigen_) December 26, 2022