Snake: వర్షాకాలంలో పాముల బెడద పెరుగుతూ ఉంటుంది. వర్షాల కారణంగా భూమిలో ఉక్కబోత పెరిగి పాములు ఇబ్బందులకు గురవుతాయి. నేలపైకి వచ్చి అటు ఇటు తిరుగుతుంటాయి. పొలాల్లో ఎక్కువగా పాములు సంచరిస్తుంటాయి. అలా నేలపైకి వచ్చిన అవి ఇతరుల్ని కరవటమో లేక వారి చేతోల్లో ప్రాణాలు కోల్పోవటమో జరుగుతుంటుంది. తాజాగా, ఓ పాము ఏకంగా మంచంపై పడుకున్న మహిళపైకి చేరింది. ఆ మహిళను భయభ్రాంతులకు గురిచేసింది.
ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, కలబుర్గిలోని మల్లాబాద్‌కు చెందిన భాగ్యమ్మ అనే మహిళ పొలంలోని మంచంపై పడుకుంది. కొద్ది సేపటి తర్వాత ఓ నాగుపాము ఆమెపైకి వచ్చి చేరింది. ఆమె నడుముపై పడగ విప్పి నిలబడింది. తన నడుముపై పాము ఉందని గుర్తించిన భాగ్యమ్మ గుండె ఆగినంతపనైంది. పక్కకు కదల్లేక, పామును ఏమీ అనలేక అల్లాడిపోయింది.
మంచంపై పక్కకు కదలకుండా చేతులు రెండూ జోడించి ‘‘ శ్రీశైల మల్లమ్మ కాపాడు’’ అంటూ దేవతను ప్రార్థించింది. కొద్ది సేపటి తర్వాత పాము మహిళను ఏమీ చేయకుండానే పక్కకు వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Rag Doll: బట్ట బొమ్మతో పెళ్లంట.. పిల్లలు కూడా ఉన్నారంట!