కొడుకు పాము కాటుతో చనిపోయాడని అతని తల్లిదండ్రులు అంత్యక్రియలు జరిపారు. కట్ చేస్తే 15 ఏళ్ల తర్వాత ఆ యువకుడు తిరిగి ఇంటికొచ్చాడు. అసలేం జరిగిందంటే?
అతని పేరు అంగేష్. గత 15 ఏళ్ల కిందట పాముకాటుకు గురై చనిపోయాడని అతని తల్లిదండ్రులు ఓ నదిలో వదిలి అంత్యక్రియలు జరిపారు. కట్ చేస్తే 15 తర్వాత అంగేష్ మళ్లీ ఇంటికి చేరుకున్నాడు. అతడిని చూసిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. కొందరైతే.. చనిపోయాడని, అంత్యక్రియలు జరిపిన వ్యక్తి మళ్లి ఎలా బతికాడని చర్చించుకుంటున్నారు. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది ఉత్తర్ ప్రదేశ్ డియోరియా జిల్లా భాగల్ పూర్ పరిధిలోని మురసా గ్రామం. ఇక్కడే అంగేష్ అనే వ్యక్తి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉండేవాడు. అయితే గత 15 ఏళ్ల కిందట అంగేష్ పాముకాటుకు గురై శరీరం అంతా పూర్తిగా రంగు మారిపోయింది. ఇక కొడుకు చనిపోయాడని అతని తల్లిదండ్రులు అంత్యక్రియలు చేస్తుండగా.. అంగేష్ మూత్రం విసర్జన చేశాడు. దీంతో వెంటనే అతని కుటుంబ సభ్యులు ఓ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. పరీక్షించిన ఆ డాక్టర్.. అంగేష్ మరణించాడని ధ్రువీకరించాడు.
ఇక చేసేదేం లేక అతని కుటుంబ సభ్యులు అంగేష్ ను అరటి ఆకుకు కట్టి సాంప్రదాయ ప్రకారం సరయూ నదిలో వదిలారు. కట్ చేస్తే.. అంగేష్ 15 ఏళ్ల తర్వాత ఇంటికి చేరుకున్నాడు. అనంతరం అంగేష్ మాట్లాడుతూ.. నదిలో నన్ను వదిలినప్పుడు నేను అపస్మారక స్థితిలో ఉన్నాను. కానీ, నేను కళ్లు తెరిచి చూస్తే పాట్నాలోని అమాన్ మాలి అనే వ్యక్తి ఇంట్లో తేలాను. అక్కడే కొన్ని రోజు ఉంటూ అమాన్ మాలి ఇంట్లో పెరిగాను. అతని వద్ద ఉంటూ పాము ఆట ఆడుతూ చాలా రకాల కార్యక్రమాల్లో పాల్గొన్నానని వివరించాడు.
ఇక అమాన్ మాలి మరణించిన తర్వాత అతని అనుచరులు.. నన్ను హర్యానాలో ఓ వ్యక్తికి అమ్మేశారు. ఇక అతని వద్దే ఏడేళ్ల ఉన్నానన్నాడు. అయితే ఇటీవల ఆ యజమాని ట్రక్ డ్రైవర్ సాయంతో ట్రక్ ఎక్కి అజంగఢ్ చేరుకున్నాను. ఆ తర్వాత వెతుక్కుంటూ వెతుక్కుంటూ చివరికి 15 ఏళ్ల తర్వాత ఇంటికి చేరుకున్నానని తెలిపాడు. ఇక చినిపోయాడుకున్న కుమారుడు 15 ఏళ్ల తర్వాత కనిపించడంతో అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంతోషంతో మురిసిపోయారు.