సాధారణంగా పిల్లలు స్కూల్ కి వెళ్లమని మారం చేస్తుంటారు. కారణం.. ఆ వయస్సులో చదువు అంటే వారికి భయం. కొందరు చిన్నారులు అయితే ఎప్పుడు పాఠశాలకు వెళ్లకుండా ఉందామా అని ఆలోచిస్తుంటారు. దాని కోసం ఎన్నో సాకులు చెప్తుంటారు. ఏదో ఓ వంక చెప్పి స్కూల్ కి డుమ్మా కొట్టే ప్రయత్నం చేస్తుంటారు. అలానే ఓ బుడతడు కూడా “సార్ గర్భ సంచి నొస్తుంది. నేనింటికి పోతా సార్” అంటూ ఇంటికి వెళ్లటానికి ఆపసోపాలు పడ్డాడు. విపరీతంగా గర్భ సంచి నొస్తుందని తన బాధను వ్యక్తం చేశాడు.
ఆ చిన్నోడు చెప్తున్న విషయాన్ని అక్కడి వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్తా తెగ వైరల్ మారింది. ఆ బుడ్డోడి అమాయకపు మాటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ వయస్సులో స్కూల్ అంటే అందరికీ అలాగే భయం వేస్తోందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.