Vijayawada: ‘‘ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు ఎవ్వరూ లేరు’’ .. తల్లుల గురించి కేజీఎఫ్ సినిమాలో హీరో చెప్పే డైలాగ్ ఇది. ఇది సినిమాలో డైలాగే అయినా వాస్తవానికి అక్షర సత్యం. బిడ్డను కాపాడుకోవటంలో తల్లిని మించిన వారు ఎవరూలేరు. బిడ్డ ప్రాణాల మీదకు వస్తే ఏ తల్లీ చూస్తూ ఉరుకోదు. తన ప్రాణాలకు తెగించైనా.. ప్రాణాలు అర్పించైనా బిడ్డను కాపాడుకుంటుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ ఫొటో..
ఆ ఫొటోలో ఓ తల్లి తాను దివ్యాంగురాలైనా కన్నబిడ్డను నడుంపై కూర్చోబెట్టుకుని, చేతిలో కర్ర సహాయంతో నడుస్తోంది. ఈ దృశ్యం విజయవాడలో కనిపించింది. విజయవాడకు చెందిన దివ్యాంగురాలైన ఓ ముస్లిం మహిళ తన బిడ్డను చేతి కర్ర సహాయంతో నడుంపై కూర్చోబెట్టుకుని మోసింది. ఓ వ్యక్తి దాన్ని ఫొటో తీశాడు.
ప్రస్తుతం ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ ఫొటోపై స్పందిస్తున్న నెటిజన్లు‘‘ తల్లి ప్రేమంటే అదే..’’.. ‘ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు ఎవ్వరూ లేరు’’.. ‘‘ ఈ సృష్టిలో తల్లి ప్రేమను మించింది ఏదీ లేదు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ ఫొటోపై ఈ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : 120 స్పీడులో ట్రక్.. చక్రాల పక్కనే చంటి బిడ్డ..