ఈ ప్రపంచంలో తల్లి స్థానం ఓ ప్రత్యేకమైనది. అందుకే.. ఈ సృష్టిలో తల్లిని మించిన యోధురాలు లేదని ‘కేజీఎఫ్’ సినిమాలో ఓ డైలాగ్ కూడా ఉంటుంది. అది కేవలం ఆ సినిమాలో డైలాగ్ మాత్రమే కాదు. నిజ జీవితంలోని వాస్తవం కూడా. తల్లి తన బిడ్డలకోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తుంది. తాను కష్టాలు పడినా పర్వాలేదు.. తమ బిడ్డలు బాగుండాలని భావిస్తుంది. అందుకే తాను తిన్నా, తినకపోయిన బిడ్డల గురించే ఎప్పుడూ ఆలోచిస్తుంటుంది. తల్లి ప్రేమను వార్తల్లో నిలిపే చాలా సంఘటనలు ఈ ప్రపంచంలో తరచుగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, ఓ తల్లి తన బిడ్డను ఎత్తుకుని భారీ వర్షంలో.. ఉత్తికాళ్లతో నడిచింది. ఓ వైపు బిడ్డను భుజాలపై మోస్తూ మరో వైపు గొడుగును పట్టుకుని నడిచింది. జిందగీ గుల్జార్ హై అనే ట్విటర్ ఖాతాదారుడు ఈ వీడియోను తన అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.
ఈ వీడియో మంచి వ్యూస్, లైక్స్, కామెంట్స్‌తో దూసుకుపోతోంది. ఈ వీడియోను ఇప్పటి వరకు లక్ష మందికి పైగా చూశారు. నాలుగు వేలకుపైగా మంది దీన్ని లైక్ చేశారు. 18 సెకన్లు ఉన్న ఈ వీడియోలో.. వర్షం పడుతూ ఉంటుంది. ఇంతలో ఓ మహిళ భుజాలపై కుమారుడ్ని మోస్తూ రోడ్డుపై వెళుతుంటుంది. అప్పుడు ఆమె కాళ్లకు చెప్పులు కూడా లేవు. ఓ చేత్తో భుజాలపై ఉన్న బిడ్డను మోస్తూ.. మరో వైపు గొడుగును పట్టుకుని ఎంతో సంతోషంగా ముందుకు నడుస్తుంటుంది. కొంత ఆమె వర్షంలో తడుస్తూ కూడా ఉంది. అయినా అదేమీ పట్టించుకోకుండా ముందుకు నడుస్తుంటుంది. ఇక, ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ తల్లి ప్రేమకు ఇంతకంటే నిదర్శనం ఉంటుందా’’.. ‘‘ ఇలా కేవలం తల్లి చేయగలుగుతుంది’’.. ‘‘ నిజమే.. ఈ సృష్టిలో తల్లిని మించిన యోధురాలు ఎవరూ లేరు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
मां तो आखिर मां होती है ❤️🙏 pic.twitter.com/bpY7J8sJMK
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 26, 2022