ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, సినీ నటి రోజా ఏం చేసినా సంచలనం కావాల్సిందే. ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందినా ఆమె.. రీసెంట్ గా మరో పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆమె వినువీధుల్లో తిరిగాడిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, సినీ నటి రోజా ఏం చేసినా, ఏం మాట్లాడినా సంచలనం కావాల్సిందే. మాట దగ్గర నుండి రాజకీయ కార్యక్రమం వరకు ప్రతిదీ సెన్సేషన్. మొన్నటి మొన్న బాపట్ల జిల్లా సూర్యలంక జిల్లాలో పర్యటించారు. ఆ సమయంలో సముద్రం వద్దకు వెళ్లారు. అయితే సముద్రంలో దిగేందుకు వెళ్లే సయమంలో తన చెప్పులు బయట విడిచారు. అయితే స్థానికంగా పనిచేసే రిసార్ట్ ఉద్యోగి చెప్పులు తడవకూడదన్న ఉద్దేశంతో వాటిని చేతితో పట్టుకుని తిరిగారు. ఇది వీడియో రూపంలో బయటకు పడటంతో వివాదాస్పదమైంది. అయితే దీనిపై సదరు ఉద్యోగి వివరణ ఇవ్వడంతో సద్దుమణిగింది. అయితే మరోసారి రోజా పేరు ఆంధ్రప్రదేశ్ లో మార్మోగుతోంది.
ఎందుకంటే ఓ నగరంలో వీధుల్లో రిక్షాపై ఆమె తిరుగాడటమే అందుకు కారణం. మంత్రి రోజా శివరాత్రి పర్వదినం నేపథ్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక నగం ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో పర్యటించారు. కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. పవిత్ర గంగానది హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. 114 ఏళ్ల తర్వాత శనిత్రయోదశి నాడే మహా శివరాత్రి కూడా రావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు అక్కడకు వెళ్లారు. కాశీలో గంగా హారతి కార్యక్రమం ముగిసిన తర్వాత ఆమె వారణాసి వీధుల్లో తన స్నేహితురాలితో కలిసి రిక్షాలో పయనించారు. తానొక సెలబ్రిటీనీ, మంత్రిని అన్న విషయం మరచి, చాలా సాదా సీదా ప్రయాణీకురాలిగా రిక్షాలో తిరిగారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై మీ స్పందనను కామెంట్ల రూపంలో తెలియజేయండి.