మనకు నిత్యం చాలా మంది వ్యక్తులను తారసపడుతుంటారు. అలాంటి వారిలో కొందరు తమ అద్భుతమైన ప్రతిభతో అందరి ఆకట్టుకుంటారు.చదువులో కొందరికి.. మరికొందరికి వారు పనిచేసే ప్రాంతంలో తమ టాలెంట్ ప్రదర్శిస్తారు. తాజాగా ఓ వ్యక్తి కూరగాయల మార్కెట్ లో చూపిన టాలెంట్ కి అందరు ఆశ్చర్యపోయారు. వాయు వేగంతో క్యాబేజీ పై ఉన్న అదనపు తొడుగును కత్తిరిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
క్యాబేజీలపైన ఎన్నో అదనపు ఆకుల పొరలు ఉంటాయని అందరికి తెలిసిందే. క్యాబేజిలను చాలా మంది ప్యాకింగ్ చేస్తున్నట్లు మనకు ఈ వీడియోలో కనిపిస్తుంది. వారంత తమ పనిలో బిజీగా ఉన్నారు. అక్కడే పని చేస్తున్న వ్యక్తి చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వాయువేగంతో క్యాబేజీలపైన ఉన్న పనికిరాని లేయర్లను తొలగిస్తున్నాడు. ఎంతో చక్కని సమన్వయంతో, ఒక విధానంలో ఆ వ్యక్తి చేస్తున్న పని అంత గొప్పగా కనిపిస్తుంది. ఒక వ్యక్తి కింద కూర్చుని ఒక్కో క్యాబేజీని పైకి విసురుతుంటే.. మరో ఆ వ్యక్తి చాకుతో అంతే వేగంగా క్యాబేజీని పట్టుకుని అదనపు లేయర్లను కత్తితో తెగ్గోసి పక్కకు విసురుతుంటే.. మరో వ్యక్తి దాన్ని పట్టుకుని బ్యాగులో వేయడాన్ని వీడియోలో చూడొచ్చు.
ఈ వీడియోను గ్రీన్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిస్టిట్యూట్ ప్రెసిడెంట్ ఎరిక్ సోల్హీమ్ ట్విట్టర్లో పంచుకున్నారు. “భారత్ కు రోబోటిక్ ఆటోమేషన్ అవసరం లేదనేది ఇందుకే”అంటూ ఎరిక్ సోల్హీమ్ కామెంట్ పెట్టడు. ఈ వీడియోను ఇప్పటికే 10 లక్షల మందికి పైగా వీక్షించారు. ఏమి టాలెంట్ రా! బాబు.. అంటూ చాలా మంది తమ స్పందనను తెలియజేస్తున్నారు. అయితే ఇది ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు మాత్రం తెలియలేదు. మరి..మీరు ఈ వీడియోపై ఓలుక్కేసి..మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
This is why India 🇮🇳 doesn’t need robotic automation.….
— Erik Solheim (@ErikSolheim) May 16, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.