‘వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్.. పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు..’ మిర్చీ మూవీలో ‘ప్రభాస్’ చెప్పిన ఈ డైలాగ్ గుర్తుంది కదా! ఈ సాహసమే చేశాడు ఓ యువకుడు. విమానం ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికురాలికి తన ప్రేమను వ్యక్తపరిచాడు. అందుకు ఆమె చిరునవ్వులు చిందిస్తూ అంగీకరించడం గమనార్హం. ఈ ఘటన ఎయిర్ ఇండియా విమానంలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాకుంటే.. వీరి ప్రేమలో ఒక ట్విస్ట్ ఉంది.
వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 2న ఒక యువతి లండన్ నుంచి ముంబైకి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించింది. ఈ విషయాన్ని ముందుగా తెలుసుకున్న ఆమె ప్రియుడు, ఆమెకు వినూత్నంగా పెళ్లి ప్రపోజ్ చేయాలనుకున్నాడు. అందుకు విమాన సిబ్బంది సహాయం కోరాడు. వారు అందుకు అంగీకరించడంతో అతడు కూడా అదే విమానంలో ప్రయాణించాడు. విమానం గాల్లో ఉండగా ఒక చార్ట్ పట్టుకుని మెల్లగా ప్రియురాలు కూర్చొన్న సీటు వద్దకు అతడు వచ్చి.. “నేను జీవితాంతం నీతో నడవాలనుకుంటున్నాను. నువ్వు కూడా నాతో కలిసి నడుస్తావా?..” రాసి ఉన్న ఆ చార్ట్ తో ఆమెకు తన ప్రేమను తెలియపరిచాడు.
మొదట అతనిని చూసి ఆశ్చర్యపోయిన యువతి.. తన సీటు నుంచి లేచి మెల్లగా అతడి వద్దకు వెళ్లింది. అనంతరం సదరు యువకుడు మోకాలిపై కూర్చొని వెంట తెచ్చిన బాక్స్ నుంచి వెడ్డింగ్ రింగ్ తీసి పెళ్లి ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా ఆనందంతో అతడ్ని హత్తుకున్నది. విమానంలోని కొందరు ప్రయాణికులు చప్పట్లతో ఈ జంటను అభినందించారు. అయితే.. ఈ ప్రేమికుల తీరుపై విమర్శలొస్తున్నాయి. ఇదంతా స్క్రిప్ట్ లా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రేమికుడు చేసింది. ఒప్పా..? తప్పా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Wedding bells were ringing for a couple onboard an #AirIndia flight to #Mumbai when a man got down on one knee mid-air and proposed to his fiancée, who was taken aback by the romantic gesture
Read more: https://t.co/nypSQ5y926 pic.twitter.com/rkvNQtmyRf
— Hindustan Times (@htTweets) January 11, 2023