కరోనా మహమ్మారి కారణంగా అందరి జీవితాలో పెనుమార్పులు సంభవించాయి. చాలా మంది ఉద్యోగాలు కొల్పోగా.. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోం అంటూ ఇంటి నుంచి ఉద్యోగాలు చేశారు. కరోనా తగ్గుముఖం పట్టినా..చాలా మంది ఉద్యోగులు.. ఇంటి నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం ఎక్కువగా చేస్తున్నారు. ఇది ఇలాంటి ఓ టెక్కీ మాత్రం..ఉద్యోగం పట్ల తనకు ఉన్న నిజాయితీని పని విధానాన్ని కొత్తగా పరిచయం చేశాడు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాకుండా, వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా వేరైటీగా వర్క్ ఫ్రమ్ పెళ్లి మండపం అనే కొత్త విధాన్నాని ఉద్యోగులకు పరిచయం చేశాడు. తాళి కట్టాల్సిన చేతులతో ల్యాప్ టాప్ పట్టుకుని పనిచేశాడు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్అవుతోంది. నెటిజన్లు సైతం రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
కలకత్తాకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి చెందిన ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఫోటోలో వరుడు పెళ్లిపీటలపై కూర్చొని ల్యాప్ టాప్ లో ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు. అదే సమయంలో పూజారు మంత్రాలు చదివి.. ఆ వరుడిని ఆశీర్వదించడం మనకు కనిపిస్తుంది. ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. క్షణాల్లో వైరల్ అయిన ఈ ఫోటోకు వేలల్లో లైక్ లు వచ్చాయి. అయితే ఈ పిక్ పై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. విషపూరితమైన పని సంస్కృతిని జనాలకి పరిచయం చేయవద్దని, ఇది ఏమాత్రం మెచ్చుకోదగినది కాదని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. కేవలం పాపులారిటీ కోసమే ఇలా పెట్టినట్లు, ఇది తమాషాగా ఉందని మరొకరు కామెంట్ చేశారు. “ఏ సంస్థ కూడా తమ ఉద్యోగిని..పెళ్లి రోజు కూడా పని చేయమని అడగదు, ఒక వేళ నిజమైతే.. ఆ వ్యక్తి పనిని, వ్యక్తిగత జీవితాన్ని సమం చేయడం నేర్చుకోవాలని” అని మరికొందరు వ్యాఖ్యానించారు.