బాధ్యత లేని యవ్వనంతో వేసే కుప్పి గంతులకు, పిల్ల చేష్టలకు ఈ మధ్య అమ్మాయిలు పడిపోవడం బాగా కామన్ అయిపోయింది. ప్రేమలో పడకపోతే ఏదో ప్రాడెక్ట్ లోపం అన్నట్టు ఫీలవుతున్నారు. ఈ చిత్ర విచిత్ర విన్యాసాలను న్యూటన్ అప్పట్లోనే చూసుంటే.. ఖచ్చితంగా దీనికి లవ్ గురు’త్వాకర్షణ శక్తి అనే పేరు పెట్టి తన మిగిలిన సిద్ధాంతాల కంటే ముందుగానే ప్రతిపాదించేవాడేమో. అంతలా ఆకర్షణకి లోనవుతున్నారు. దీనికి కారణం ప్రేమకి, ఆకర్షణకి తెలియని స్టేజ్ అని, ఆ స్టేజ్‍లో ఉన్నప్పుడు ఈ రెండిటికీ తేడా తెలియదని రీసెంట్‌గా సింగిల్స్ ప్రతిపాదించారు. దాన్నే నిబ్బా, నిబ్బీ స్టేజ్ అంటారని కూడా ఈ సింగిల్స్ అనబడే సోషల్ మీడియా సైంటిస్టులే ప్రతిపా’దించారు. వీళ్ళ ప్రతిపాదనలకి తగ్గట్టే నేటి యూతు తయరైంది.
అప్పుడప్పుడే టీనేజ్‌లో అడుగుపెడతారేమో.. ఇక తమకి ప్రేమించుకోవడానికి లైసెన్స్ వచ్చినట్టు ఫీలవుతూ ఉంటారు. ఈ జాబితాలో ఒక యువతి చేరిపోయింది. ఏకంగా ట్రెయిన్‌లో యువకుడితో ప్రేమ ప్రయాణం మొదలుపెట్టేసింది. తనతో పాటు వెనక సీట్లో కూర్చుని ప్రయాణం చేస్తున్న కుర్రాడి చేష్టలకు ఇంప్రెస్ అయిపోయింది. ఇంప్రెస్ అయిపోయే రేంజ్ స్టంట్లు ఏమీ చేయలేదు గానీ కోతి చేష్టలు, కుప్పి గంతులు, వెకిలి వేశాలు వేశాడు. అంతే ఆ వేశాలకి ఆ మహా నటి పడిపోయింది.
ఇక వెంటనే బ్యాగ్‌లోంచి లవ్ లెటర్ తీసి సైలెంట్‌గా కుర్రాడి చేతిలో పెట్టేసింది. ఆ కుర్రాడి ఆనందం చూడాలి. జీవితంలో ఒక పెద్ద లక్ష్యాన్ని చేధించినట్లే ఫీలైపోతున్నాడు. ఈ వీడియోని ఎవరో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. ముందుగానే ఈ ఇద్దరికీ పరిచయం ఉందో లేక ట్రెయిన్‍లోనే పరిచయం ఏర్పడిందో తెలియదు గానీ.. వీళ్లని రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.