ప్రేమ కోసం, ప్రేమించిన వ్యక్తి కోసం ఎంతటి త్యాగానికైన సిద్ద పడుతున్నరు కొందరు ప్రేమికులు. ప్రేమతో రెండు మనసులు ఏకమై లోకాన్ని మరిచి ప్రేమ ప్రపంచంలో విహరిస్తుంటారు ప్రేమ పక్షులు. క్షణం కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా గాఢమైన ప్రేమలో మునిగితేలుతారు.
ప్రేమ కోసం, ప్రేమించిన వ్యక్తి కోసం ఎంతటి త్యాగానికైన సిద్ద పడుతున్నరు కొందరు ప్రేమికులు. ప్రేమతో రెండు మనసులు ఏకమై లోకాన్ని మరిచి ప్రేమ ప్రపంచంలో విహరిస్తుంటారు ప్రేమ పక్షులు. క్షణం కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా గాఢమైన ప్రేమలో మునిగితేలుతారు. ప్రేమించిన వ్యక్తికి ఏ చిన్న ఆపద వచ్చిన విలవిలలాడిపోతుంటారు. ఇదే విధంగా ఓ ప్రియురాలు ప్రాణంగా ప్రేమించిన ప్రియుడి కోసం ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. అన్నీ తానే అనుకున్న ప్రియుడు అలా అయిపోవడంతో మానసిక వేధనకు గురైంది. ప్రియుడితో కలకాలం కలిసి జీవించాలని అనుకున్న ఆ ప్రియురాలికి నిరాశే మిగిలింది. ఈ క్రమంలోనే కఠిన నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే?
ప్రేమించిన ప్రియుడిని మరిచిపోలేక ఓ యువతి ప్రాణాలనే వదిలేసింది. ఈ విషాద ఘటన యానాంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. యానాంలోని యూకేవీనగర్‌కి చెందిన మీసాల మౌనిక కురసాంపేటకు చెందిన నిమ్మకాయల చిన్నాతో రెండు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉంది. కాగా గంజాయికి బానిసైన చిన్నా క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సోదరుడిన రూ. 500 అడిగితే ఇవ్వలేదనే కోపంతో ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రియుడి మరణాన్ని జీర్ణించుకోలేని మౌనిక గుండెలు పగిలేలా ఏడ్చింది. చిన్నాకు సంబంధించిన వస్తువులను తన రూంలో పెట్టుకుని ఫొటోలు గోడలకు అతికించి చూసుకుంటూ తీవ్ర వేధనకు లోనైంది. ప్రియుడిని మరిచిపోలేని ఆమె ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.