పెళ్లి అనేది రెండు కుటుంబాల మధ్య జరిగే ఓ పండుగ. ఇలాంటి వేడుకకు ఇరు కుటుంబాల బంధువులతో పాటు వధువరుల స్నేహితులు హాజరవుతారు. అయితే ఈ పెళ్లిల్లో బంధువులతో పాటు వధువరుల స్నేహితులు చేసే సందడి మాములుగా ఉండదు. అసలు వధువరుల స్నేహితులు ఉంటేనే పెళ్లికి సందడి. ఎంత కుటుంబ సభ్యులు ఉన్న కాని పెళ్లిపందిరి వద్ద స్నేహితులు ఉంటే ఆ హుషారే వేరు. నవ్వులు, జోకులు, సెటైర్లు.. ఇలా ఒకటేంది మస్తుంటాయి స్నేహితుల ముచ్చట్లు. అచ్చం అలాగే తాజాగా ఏల్లూరు జిల్లా ద్వారక తిరుమలోని పెళ్లిలో పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ రచ్చ చేశారు. మండపం పై స్ప్రే తీసుకుని వధువరులపై కొట్టారు. అంతటితో ఆగక పక్కనే మంత్రాలు చదవుతున్న పంతులపై కూడా కొట్టి తెల్లటి నురగతో నింపేశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన పంతులు ఆ పెళ్లికొడుకు ఫ్రెండ్స్ పై పొట్టు పొట్టున తిట్లు తిట్టాడు. వద్దంటే.. నాపైనే స్ప్రే కొడ్తారా.. అంటూ చిందులేశాడు. పంతులు చేసిన హంగామాకు నూతన వధువరులతో సహ అక్కడి వారందరు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.