చలికాలం వచ్చేసింది. రోజు రోజుకు అంతకంతకు పెరుగుతోంది. బయటికి వెళ్లాలంటే ఒంటినిండా కప్పుకుని వెళ్లాల్సిన పరిస్థితి. ఇన్ని జాగ్రత్తలు తీసుకునే మనమే చలికి తట్టులేక పోతే మరి మూగజీవాల సంగతేంటి. ఈ ప్రశ్న ఓ రైతును మదిని కలిచివేసింది. దీనికి ఓ ఉపాయం ఆలోచించాలనుకున్నాడు. వెంటనే రెయిన్ కోట్లు తయారు చేశాడు. వాటిని తాను అపురూపంగా పెంచుకునే మేకలకు తొడిగాడు. ఇంకేముంది.. అవి నడుచుకుంటూ రోడ్డుపై వెళ్తుంటే అందరి చూపు వాటివైపే. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
తమిళనాడు, తంజావూరులోని కులమంగళం గ్రామానికి చెందిన గణేశన్(74) అనే రైతు ఈ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు. తాను అపురూపంగా పెంచుకునే మేకలు వర్షాకాలంలో వానతో ఇబ్బందులు పడకుండా, చలి కాలంలో చలి నుంచి వెచ్చగా ఉంచడం కోసం.. బియ్యం బస్తాలను ఉపయోగించి తాత్కాలిక రెయిన్‌కోట్‌లను తయారు చేశాడు. సైజును బట్టి వాటిని అన్ని మేకలకు తొడిగి మేపడానికి తీసుకెళ్తున్నాడు. మొదట్లో ఈ విషయంపై తోటి గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేసినప్పటికీ.. మూగజీవాల పట్ల ఆయనకున్న ప్రేమను చూసి ఆయనను అభినందిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నారట. ఈ అంశం ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Goat got raincoat ,,,tamilnadu farmer gives raincoat to their goats for escape from heavy rain. pic.twitter.com/TopDbJMuPj
— GK PILLAI (@KRISHNA_SGK_) November 16, 2022
”புயலே வந்தாலும் சாரல் கூட அடிக்காது” – ஆடுகளுக்கும் வந்துவிட்டது Rain Coat#raincoat #Rain #goatvideo #goat #SathiyamTv #perambalur pic.twitter.com/VWecrwoQAT
— SathiyamTv (@sathiyamnews) November 15, 2022