ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రో బ్యాక్ ట్రెండ్ భీభత్సంగా నడుస్తోంది. సోషల్ మీడియా వేదికలైన ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్, స్నాప్ చాట్ వీటిల్లో త్రో బ్యాక్ పిక్, వీడియోలదే హవా. చిన్న, పెద్ద అని తేడా లేకుండా సెలబ్రిటీలంతా ఇప్పుడు త్రో బ్యాక్ ట్రెండ్‌నే అనుసరిస్తున్నారు. వారి చిన్నప్పటి ఫోటోలు లేదా చాలా క్రితం నాటి ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తున్నారు. అవి వైరల్‌గా మారి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. అటువంటిదే ఈ ఫోటో. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట్ల హల్ చల్ చేస్తోంది.
ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు కదా. అందులో ఒకరినైతే ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఆయనే దిగ్గజ నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు. మరీ ఆయన పక్కనే పసుపు రంగు చొక్కా ధరించి, కళ్ల జోడు పెట్టుకుని, అమాయకమైన చూపులతో, వినమ్రతతో నుంచొని ఉన్న ఈ కుర్రాడిని గుర్తు పట్టారా. ఎవరాని ఆలోచిస్తున్నారా.. మరెవరో కాదండి ఆయన మనవడు, నందమూరి తారకరత్న. సీనియర్ ఎన్టీఆర్ కుమారుల్లో ఒకరైన మోహన్ కృష్ణ కుమారుడే తారకరత్న. 1983లో జన్మించిన తారకరత్న, 20 ఏళ్ల ప్రాయంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
తారకరత్నకు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికీ దక్కని అరుదైన రికార్డు కూడా ఉంది. అదే ఒకే సమయంలో హీరోగా తొమ్మిది సినిమాలను ప్రారంభించిన వరల్డ్ రికార్డు ఆయన సొంతం. తొలి సినిమా ఒకటో నంబర్ కుర్రాడు షూటింగ్ ప్రారంభించిన రోజే మిగిలిన సినిమాలను మొదలు పెట్టారు. వీటిలో ఒకటో నెంబర్ కుర్రాడు, భద్రాద్రి రాముడు, యువరత్న, నో సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. మిగిలిన సినిమాలన్నీ ఆగిపోయాయి. తొలి సినిమా పర్వాలేనదనిపించినా.. తరువాత హీరోగా చేసినా ఏ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు.
దీంతో విలన్ గానూ ప్రయత్నించారు. అయినప్పటికీ విజయం చేరువ కాకపోవడంతో అడపా దడపా చిత్రాల్లో నటిస్తున్నారు. సినిమాలు ఇక తనకు సెట్ కాదని భావించిన ఆయన .. రాజకీయాల్లోకి రావాలని భావించారు. అందులో భాగంగా టిడిపి నేత నారా లోకేష్ చేపడుతున్న యువగళం కార్యక్రమం నిమిత్తం కుప్పం వచ్చిన తారకరత్న, అక్కడ చేపట్టిన ర్యాలీలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తారకరత్నకు భార్య, కూతురు ఉన్నారు. అయినా త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. తాత పక్కన తారకరత్న వినయంగా నుంచొన్న ఈ ఫోటోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.