ఆనందాన్ని ఎవరు కొరుకోరు? నిజమైన ఆనందం అందరికి కావాలి. కానీ.., ఈ పోటీ ప్రపంచంలో మనిషి నిజంగా ఆనందంగా ఉండటం సాధ్యం అవుతుందా? లైఫ్ ని రేస్ లా మార్చేసుకుని, మన దగ్గర ఉన్న వాటిని ఆస్వాదించడం మానేసి, లేని వాటి కోసం పరుగులు పెడుతున్నాము. ఇది మనలో ప్రతి ఒక్కరు చేస్తున్న తప్పే. కానీ.., ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మన బాల్యం ఇలా ఉండేదా? కచ్చితంగా కాదు! ఒకే ఒక్క జామకాయ దగ్గర ఉంటే వందల ఎకరాల జామ తోట మనదే అన్నట్టు సంబర పడేవాళ్ళం. పుల్ల ఐస్ కొనిస్తేనే పరవశించిపోయిన రోజులు అవి. అమ్మ చీర కొంగులో దాచిన పావలా బిళ్ళ ఇచ్చిన ఆనందాన్ని ఈరోజుల్లో పొందగలమా? దీన్ని బట్టి ఏమి అర్ధమైంది? ఆనందంగా ఉండాలంటే.. మన దగ్గర ఉన్న వాటితోనే సంతృప్తి పడాలి. ఇంకా గట్టిగా చెప్పాలంటే మళ్ళీ మనం పిల్లలం అయిపోయి, స్వచ్ఛమైన మనసుని, ఆలోచనలను వంట పట్టించుకోవాలి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫోటో ఇప్పుడు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్తే..,
ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. చాలా ఇళ్లల్లో చిన్న పిల్లల దగ్గర కూడా స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. ఇక.. సెల్ఫీల మోజు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ.., అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉండటం సాధ్యం కాదు కదా? బిడ్డలకి సద్ది బువ్వ పెట్టడానికి కూడా కష్టపడే తల్లిదండ్రులు ఇంకా మన మధ్య ఉన్నారు! మరి.. ఆ పేదింటి బిడ్డలకు ఈ సెల్ఫీ ఆనందాలు అందడం ఎలా? నిజంగా ఇది చాలా పెద్ద ప్రశ్న కదా? కానీ.., ఆ పసి హృదయాలకు ఈ కష్టాలు అన్నీ తెలియవు. తమ దగ్గర డబ్బు లేదు అన్న బాధ లేదు. వారికి తెలిసిందల్లా తమ దగ్గర ఉన్న వాటితో ఆనందంగా జీవించడమే. ఈ ప్రాసెస్ లోని ఐదుగురు చిన్నారులు స్లిప్పర్ సెల్ఫీ ని కనిపెట్టారు.
స్కూల్ యూనిఫార్మ్ వేసుకున్న ఓ చిన్నారి.. తన కాలి చెప్పును స్మార్ట్ ఫోన్ లా, తన చేతులో పట్టుకున్నాడు. ఆపై.. మిగిలిన నలుగురు చిన్నారులు కల్మషం లేని స్వచ్ఛమైన నవ్వును చిందిస్తూ.. ఆ స్లిప్పర్ సెల్ఫీకి ఫోజు ఇస్తూ నిలబడ్డారు. వాళ్ళ స్లిప్పర్ సెల్ఫీ క్లిక్ మనకపోయినా.. ఆ చిన్నారులకు ఆ ప్రాసెస్ సంతోషాన్ని ఇచ్చింది. తాము సెల్ఫీ దిగాము అన్న తృప్తిని మిగిల్చింది. ఆ చిన్నారులకి కావాల్సింది కూడా అదే. తమ స్లిప్పర్ సెల్ఫీలో ఫోటో రాదని వాళ్ళకి తెలిసి కూడా ఇలా ఫోజు ఇచ్చారు అనమాట. ఇదే.. స్వచ్ఛమైన ఆనందం. ఆనందంగా బతకడానికి ఏమి కావాలి అని లెక్కలు వేసుకోని చిక్కులు పడటం కన్నా.., ఉన్న వాటితో ఆనందంగా బతకడం మేలు అని ఆ చిన్నారుల స్లిప్పర్ సెల్ఫీ చెప్పకనే చెప్తోంది. ఇంత అర్ధం దాగుంది కాబట్టే.. ఇప్పుడు ఆ చిన్నారుల సెల్ఫీ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ చిన్నారులు చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.