పిల్లల్ని మార్చుకున్న ఈ అన్నాదమ్ముళ్లు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఈ అన్నదమ్ములు పిల్లలను ఎందుకు మార్చుకున్నారు? అసలేం జరిగిందంటే?
పెళ్లి చేసుకున్న దంపతులకు పిల్లలను కనాలనే కోరిక బలంగా ఉంటుంది. కానీ, కొన్ని అనారోగ్య కారణాల వల్ల కొంతమంది దంపతులకు పిల్లలు కలగడం లేదు. దీంతో ఆ దంపతులు మానసికంగా తీవ్ర మనోవేదనకు గురవుతూ ఉంటారు. అయితే అలాంటి దంపతులు అనాధ పిల్లలను తెచ్చుకుని పెంచుకుంటుంటారు. ఇలాంటి ఘటనలు మనం అనేకం చూసి ఉంటాం. అయితే ఇదే తరహాలో ఓ మంచి నిర్ణయం తీసుకున్న ఓ ఇద్దరు అన్నదమ్ముళ్లు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అసలు ఈ స్టోరీలో ఏం జరిగిందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మహారాష్ట్ర సాంగ్లీ జిల్లా షెగాల్ గ్రామంలో బిరుదేవ్ మానే, అప్పాసో మానే అనే అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు. గతంలో ఇద్దరు వివాహాలు చేసుకుని సంతోషంగా కాపురాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే బిరుదేవ్ మానే అనే వ్యక్తికి పెళ్లైన కొంత కాలానికి ఇద్దరు అబ్బాయిలు జన్మించారు. కానీ, బిరుదేవ్ కు మాత్రం ఓ కూతురు జన్మించి నుంటే బాగుండు అని తనలో తాను కుమిలిపోతూ బాధపడేవాడు. ఇక తన సోదరుడైన అప్పాసో మానేకు కూడా ఇద్దరూ ఆడ పిల్లలే జన్మించారు.
ఇద్దరూ ఆడ పిల్లలే జన్మించడంతో వంశాన్ని నిలబెట్టేందుకు ఓ కుమారుడు కావాలని అప్పాసో అనుకున్నాడు. ఇలా అన్నదమ్ములు ఇద్దరూ తమలో తాము బాధ పడుతూ ఉండేవారు. ఇద్దరు ఆడ పిల్లలు, ఇద్దరు మగ పిల్లలు పుట్టడంతో అన్నదమ్ములు నిరాశకు గురయ్యారు. ఈ సమయంలోనే వారికి ఓ అద్భుతమన ఆలోచన వచ్చింది. అదే పిల్లలను మార్చుకోవడం. ఇక ఇద్దరి ఒప్పందం ప్రకారం.. అన్నదమ్ముళ్లు.. మగ, ఆడ పిల్లలను మార్చుకుని నలుగురికి ఆదర్శంగా నిలిచారు.
వీరి చేసిన పనిని చూసి స్థానికులు సైతం మెచ్చుకుంటున్నారు. కుళ్లు, కుతంత్రాలతో ఎప్పుడూ గొడవ ఈ కాలంలో.. ఈ అన్నదమ్ములు నిర్ణయం మందు తరాలకు మార్గదర్శకులుగా మారారని పలువురు అభినందిస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మగ, ఆడ పిల్లలను మార్చుకున్న ఈ అన్నదమ్ముల నిర్ణయంపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.